పసిడి ధరలు మార్కెట్ లో రోజుకో విధంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధరలపై ఆధారపడి ధరల్లో మార్పులు, చేర్పులు వస్తున్నాయి. నిన్న నమోదు అయినా ధర మార్కెట్ లో లేదు. కరోనా పెరుగుతున్న నేపథ్యం లో ధరలు పెరుగుతున్నాయి. ఇకపోతే బంగారు ధరల నిర్ణయం పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అటు పసిడి కొనుగోలు చేసేవారికి. ఇటు అమ్మేవాళ్ళకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం దేశంలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమలు లోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. జువెలరీ సంస్థలు హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాల ను మాత్రమే అమ్మాలని హెచ్చరించింది. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా ఒకవేళ గోల్డ్ హాల్ మార్క్ లేని నగల ను అమ్మితే భారీ జరిమానా లు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మోదీ సర్కార్ ఇప్పుడు జువెలరీ సంస్థలకు ఊరట కలిగే ప్రకటన చేసింది.  ఈ విధానం ఆగస్టు లో పూర్తిగా అమల్లోకి వస్తుంది.


అప్పటి వరకు ఎలాంటి పెనాల్టీ ఉండదని తెలిపింది. హాల్ మార్క్ లేకపోయినా పర్వాలేదని చెప్పుకొచ్చింది. కాకపోతే బంగారాన్ని కొనుగోలు చేసేవాళ్ళు ఫిర్యాదు చేస్తే మాత్రం ఈ విషయం పై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. బీఐఎస్ కేర్ యాప్ లేదా వినియోగదారుల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా కానీ ఈ హాల్ మార్క్ పై ఫిర్యాదు చేయవచ్చు. పిర్యాదులు ఒకసారి దృష్టి కి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపోతే ఈ రూల్ ను రెండేళ్ల క్రితమే అమల్లో కి వస్తుందని చెప్పిన కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాదిలో కూడా జనవరి నుంచి జులై వరకు సాగదీసి, మొత్తానికి అమల్లోకి తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: