కరోనా మహమ్మరి విజ్రుంభిన్న క్రమంలో ఉద్యోగాలను వదిలి సొంత ఊర్లకు వెళ్ళి పోయారు. తినడానికి తిండి కూడా దొరకక చాలా దాతల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.. అయితే కొంతమంది మాత్రం బ్యాఅంకుల నుంచి రుణాలను పొంది సొంతంగా బిజినెస్ లను చేస్తున్నారు. కొంతమంది మాత్రం బిజినెస్ లు ఎందుకు నష్టాలు కూడా ఉంటాయని వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు రుణాలకు బ్యాంకు వాళ్ళు ఎక్కువ వడ్డీ కూడా వేస్తారని భయపడతారు. అలాంటి వాళ్లకు టాటా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.


త్వరలోనే టాటా మొబైల్ యాప్ ను అందుబాటు లోకి  తీసుకొస్తుననట్లు తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. ఈ యాప్ ద్వారా అన్నీ రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. నిత్యావసర సరుకుల నుంచి ఎలెక్ట్రానిక్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేటీఎం, రిలయన్స్ జియో మార్ట్ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.


ఇకపోతే ఈ యాప్ తో పాటు సూపర్ యాప్ ను కూడా తీసుకురానుంది. దాని ద్వారా రుణాలను కూడా అందించాలని ప్రయత్నాలు  చేస్తుంది. ఇలా రుణాలు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సర్వీసులు కూడా అందించాలనే ఆలోచన లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. రుణాలు, ఇన్స్యూరెన్స్ లు అందించడానికి బ్యాంకులు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. రెండు మూడు యాప్ లలోకి  వెళ్లి కొనుక్కోవడం కన్నా ఇలా ఒకదాంట్లోనే కొనుగోలు చేయడం ఉత్తమం అనే టాక్ జనాల నుంచి వస్తుంది. ఇక ఈ యాప్ లాంచ్ అయితే మిగిలిన యాప్స్ పరిస్థితి ఏంటో చూడాలి.. ఎప్పుడూ లాంచ్ అవుతుందొ తెలియాల్సి ఉంది.. ఈ యాప్ కనుక సక్సెస్ అయితే టాటా బిజినెస్ టాప్ లోకి వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: