కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.... అటు వాహనదారులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరగడం తప్ప అసలు ఏ మాత్రం తగ్గటం లేదు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు కావడం కారణంగా... కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించింది తప్ప ఎక్కడ కూడా పెంపుదల చేయలేదు. అయితే ఎన్నికలు అయిపోగానే... చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ కొట్టేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ ధరలు కూడా పెట్రోల్ ధర తో పోటీ పడుతున్నాయి. అయితే... చమురు ధరలతో విసుగిపోతున్న వాహనదారులకు చల్లటి కబురు చెప్పింది ఐఏఎన్‌ఎస్‌ నివేదిక. అవును రాబోయే రోజుల్లు చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు  ఐఏఎన్‌ఎస్‌ నివేదిక తేల్చేసింది.

ఈ  ఐఏఎన్‌ఎస్‌ నివేదిక ప్రకారం... జూన్‌ నెల అఖరిలో క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ కు 77 యూఎస్‌ డాలర్లకు పెరగగా.. అది కాస్తా గడిచిన 10 రోజుల్లో 10 శాతానికి తగ్గుముఖం పట్టిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే.. ప్రస్తుతం ధర.. ఇప్పుడు బ్యారెల్‌ కు 68.85 యూఎస్‌ డార్లుగా ఉండగా...త్వరలోనే ఈ ధర 70 డాలర్ల కంటే తక్కువగా ఉంటే... చమురు ధరలు కచ్చితంగా తగ్గుముఖం పడతాయని  ఐఏఎన్‌ఎస్‌ నివేదిక పేర్కొంది. రోజు వారీ ధరల సవరణల ప్రకారం... ఓఎంసీలు ప్రతి రోజు ఉదయం పూట చమురు ధరలను మార్పులు చేస్తాయి.


రిటైల్‌ ఇంధన ధరలను మరియు ఇంటర్‌ నేషనల్‌ చమురు ఉత్పత్తుల ధరలు, డాలర్‌ మార్పిడి రేటును పదిహేను రోలింగ్‌ సగటును బెంచ్‌ మార్క్‌గా తీసుకుని ఈ రేట్లను నిర్ణయిస్తాయి. అయితే... ఆ 15 రోజుల బెంచ్‌ మార్క్‌ మళ్లీ వస్తే.... దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పడనున్నట్లు  ఐఏఎన్‌ఎస్‌ నివేదిక తెలిపింది. కాగా... ఇవాళ హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర. రూ. 105.83  ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.96 వద్ద కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: