ప్రస్తుతం మనకి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న వస్తువులను ఎక్కువగా విక్రయిస్తుంటారు. అలా విక్రయిస్తున్న వాటిలో పేపర్ల బిజినెస్ కూడా ఒకటి. అయితే ఈ బిజినెస్ ను ఎలా చేయాలి, ఎంత మొత్తంలో లాభం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఎటువంటి చిన్న డాక్యుమెంటుకు జిరాక్స్ కావాలన్నా మనం ఎక్కువగా వాడుకునేది పేపర్ లనే. అలాంటి పేపర్లను ప్రతిరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పేపర్ బిజినెస్ లో ఏ ఫోర్ సైజు పేపర్ తయారు చేసి, హోల్ సేల్ షాప్ లకు, కాలేజీలకు, పాఠశాలలకు, జిరాక్స్ సెంటర్లకు ఇలా వివిధ రకాలుగా ఈ పేపర్ ల వినియోగం ఎక్కడ ఎక్కువ ఉంటే,అక్కడ వీటిని మనం విక్రయించవచ్చు. ఈ వ్యాపారాన్ని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే పెద్దమొత్తంలో లాభాలను పొందవచ్చు.

ఇక ఈ పేపర్ లను తయారు చేయడానికి మనకు ఒక పేపర్ రోలింగ్ మేకింగ్ మెషిన్ అవసరమవుతుంది. ఈ మెషిన్ ధర మార్కెట్లో సుమారుగా రూ. 5 లక్షలు  ఉంటుంది. ప్రస్తుతం ఈ మెషిన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మీరు ఆన్లైన్లో కొనుగోలు చేయదలచుకుంటే ఇండియా మార్ట్ అనే వెబ్ సైట్ లో ఈ మెషిన్లను ఆర్డర్ పెట్టవచ్చు. ఇక ఈ మెషిన్ లో పేపర్ రోల్స్ ను పెట్టి వాటిని నీట్ గా కట్ చేసి, అనంతరం ప్యాక్ చేసి విక్రయించవచ్చు.

ఇక ఈ పేపర్ లు క్వాలిటీని బట్టి ధర పలుకుతాయి. సాధారణంగా ఒక్కో బండిల్ తయారీకి వంద రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక దీనిని మార్కెట్లో రూ. 200 నుంచి 220 రూపాయల వరకు విక్రయించవచ్చు. మినిమం వంద రూపాయలు లాభం వేసుకున్న, రోజుకు 50 బండిల్ లను తయారు చేయవచ్చు. అంటే రోజుకు ఐదు వేల రూపాయలు లాభం వస్తుంది. అదే నెల ప్రకారం చూసుకుంటే రూ.1,50,000 మీ చేతికొస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: