ఎయిర్టెల్ రూ.499 ప్లాన్
రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను ఎయిర్టెల్ తమ కస్టమర్స్ కు అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా వీడియోలను చూడొచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ లతో పాటు ఇతర సదుపాయాలు కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ.699 ప్లాన్
రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల గడువుతో.. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా చూడొచ్చు. అలాగే రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇతర సదుపాయాలు అదనం.
ఎయిర్ టెల్ రూ.2798 ప్లాన్
రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల గడువుతో రోజుకు 2 జీబీ హైస్పీడ్ ఇంటర్ నెట్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను తమ కస్టమర్స్‌కు అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా వీడియోలను వీక్షించొచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ లు ఇతర సదుపాయాలు కూడా అందిస్తోంది.