ప్రస్తుత పరిస్థితులలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోవాలి అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంతో పాటుగా డిజిటల్ ఎకానమీ ని కూడా ధీటుగా ముందుకు తీసుకుపోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. అల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 48వ సదస్సును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  కరోనా కారణంగా ఈ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సంక్షోభాన్ని అభివృద్ధితోనే ఎదుర్కోగలమని తెలిపారు. అందుకోసం పటిష్టమైన సమగ్రమైన మరియు స్థిరమైన వృద్ధిని సృష్టించుకోవాలని ఆయన అన్నారు.

ఒక పక్క సంక్షోభం మిగిల్చిన నష్టాలను తగ్గించుకుంటూనే మరోపక్క ప్రణాళికా బద్దంగా అభివృద్ధికి కృషి చేయాలని శక్తి తెలిపారు. ఇందుకోసం మధ్య తరహా పెట్టుబడులు, పటిష్ట ఆర్థిక వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి.  దానిప్రకారంగానే అందరికీ విద్యా, వైద్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక మరియు డిజిటల్ రంగాలలో పెట్టుబడులు స్వాగతించడం అవసరం అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కరోనా తో ఒత్తిడిలో ఉన్న సంస్థలను, కార్మిక వ్యవస్థల నిర్వహణలో మరింత సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ముఖ్యంగా ఉద్యానవన రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చిన్న తరహా గ్రామాలు, పట్టణాల లో ఉపాధి, సమగ్రాభివృద్ధి సాధించవచ్చని శక్తి అన్నారు. కరోనా సవాళ్లతో వెనక పడిన ప్రైవేట్ రంగాలకు ఊతం ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రపంచం మొత్తం సంక్షోభం ఎదుర్కొంటుంది కాబట్టి ఆయా దేశాల మధ్య అనేక విషయాలలో సహకారం ప్రధానంగా ఉండాల్సిన అవసరం గురించి గుర్తుచేశారు. వాక్సినేషన్ విషయంలో కూడా అన్ని దేశాలు కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పెట్టుబడులను తగ్గించుకోవాలని మొత్తం ఆటోమేషన్ చేస్తే కార్మిక వర్గం కుదేలైపోతుందని, అందుకే రెంటికి ముఖ్యత ఇస్తూ శ్రామిక శక్తి లో నైపుణ్యం పెంచేందుకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే భారీగా పెరిగిపోతున్న స్టార్ట్ అప్ లు భారత్ పోటీతత్వంలో ముందున్నదని తెలియజేస్తున్నాయని ఆయన తెలిపారు.

భారత్ లో డిజిటల్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని శక్తీ తెలిపారు. భారత్ లో క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్ షూటింగ్, డేటా అనలిటిక్స్, వర్క్ స్పేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లై చైన్ ఆటోమేషన్, 5జి, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలలో డిమాండ్ భారీగా ఉంటుందని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: