మద్యపానసేవనం కూడా దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఏ పార్టీ జరిగిన మద్యం ఏరులై పొంగితే తప్ప అది పార్టీగా పరిగణించడం లేదు. అంతగా ఇది భారతీయుల మనసు దోచుకుంది. ఎక్కడ చూసినా ఈ మద్యం దుకాణాలు వీరివిగా కనిపిస్తూనే ఉన్నాయి. తాగేవాళ్ళు ఎక్కువ అవడంతో ప్రభుత్వాలు కూడా కొత్త కొత్త మద్యం పాలసీలు కూడా తెస్తున్నారు. దీనితో ప్రతి ఏడాది మద్యం ప్రియుల వలన వచ్చే ఆదాయం భారీగానే ఉంది. ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే మద్యం నుండి వచ్చే డబ్బే శరణ్యం అన్నంతగా ఇది భారత్ లో స్థిరపడిపోయింది. తినడానికి తిండి లేని వాడు కూడా తాగటానికి మద్యం కొనుక్కుంటుండటం దేశంలో చూస్తూనే ఉన్నాం.

అయితే ఎక్కడో ఒక పార్టీ నేతలు మద్యనిషేధం ఒక పాలసీ గా మేనిఫెస్టో తెస్తున్నారు. పొరపాటున కూడా వాళ్ళు గెలుస్తారని ఆశించడం కష్టమే, కానీ అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుట్టుకొస్తుండటం విశేషం. కరోనా సంక్షోభం లో కూడా మద్యం ప్రియుల హడావుడి చూశాం. లాక్ డౌన్ లో నిత్యావసర వస్తువుగా దానిని కూడా  కొనుక్కొని నిల్వ చేసుకున్న వారు బోలెడు మంది ఉన్నారు. ఇంతలా మద్యం దేశంలో విస్తరించింది. తాగేవాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మెస్తున్నాం అని అంటారు.. ఎలాగైతే పొగ తాగటం అనారోగ్యం అని సిగరెట్ ప్యాకెట్ పై రాయడం మాత్రమే వాళ్ళ వంతు, తాగి రోగాలు తెచ్చుకుంటే అది తాగిన వాడి ఖర్మం అన్నట్టే దేశంలో మద్యం అమ్మకాలు ఉన్నాయి.

వీటికి కొత్త పాలసీలు, తప్పులు చేస్తే జరిమానాలు విధిస్తూ వీలైనంత వాళ్ళ వద్ద నుండి ప్రభుత్వాలు కూడా దోచేసుకుంటున్నాయి. తాజాగా బీర్ సంస్థలపై కంపిటిషన్ కమీషన్ జరిమానాలు విధించారు. ఇది దాదాపుగా 875 కోట్లు ఉంటుంది. జరిమానా విధించబడిన సంస్థలలో యునైటెడ్ బ్రువరీస్ లిమిటెడ్; కార్ల్ బర్గ్ ఇండియా; ఆల్ ఇండియా బ్రువర్స్ అసోసియేషన్ తదితరులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న సంస్థలకు కూడా అమ్మకాలు, సప్లై విషయాలలో జరిమానా వర్తిస్తుందని కమీషనర్ తెలిపింది. వీరందరూ కాంపిటీషన్ లా ను అతిక్రమించారని విచారణలో తేలడంతో జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: