రైతు లేకుండా ఏ వస్తువు ఉత్పత్తి కాదు, అయినా ఆ రైతు అంటే ఎంతో చులకనగా చూస్తుంటాం. కానీ కరోనా తరువాత అయినా ఈ అభిప్రాయం లో మార్పులు వస్తున్నాయని భావిస్తున్నారు నిపుణులు. నిజానికి సరైన విషయాలు తెలుసుకుంటూ వ్యవసాయం చేస్తే అది కూడా మంచి లాభాలను ఇచ్చే పరిశ్రమే. ఈ విషయాన్ని ప్రస్తుత తరంలో కొందరు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయేతర యువత కూడా తమ తమ ఉద్యోగాలు వదిలేసి మరి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. సాంప్రదాయ రైతుల కంటే వీళ్లు సరికొత్త ఫలితాలు సాధిస్తున్నారు. వీళ్లు సాధించే విజయాలు చూస్తే, అతి త్వరలో యువత వ్యవసాయాన్ని కూడా ఒక ప్రధాన వృత్తిగా/ ఉపాధిగా ఎంచుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీళ్లు పాటించే పద్ధతులు, వ్యవసాయ విధానం లో కొత్త పుంతలు ఏమి లేనప్పటికీ వాళ్ళు సాంప్రదాయ వ్యవసాయాన్ని కాస్త కొత్తగా చేస్తూ సత్ఫాలితాలు సాధిస్తున్నారు. పూర్తిగా లాభాల కోసం మాత్రమే కాకుండా బాధ్యతగా వీళ్లు చేస్తున్న పని చూసి మరికొందరు ఈ వృత్తివైపు మల్లుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అటువంటి రైతు అందరికి ఆదర్శంగా నిలిచాడు. పెద్ద చదువులు చదివినప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ఆసక్తి మేరకు ఉన్న ఒక్క ఎకరంలోనే గొప్పగా ఫలితాలు సాధిస్తున్నాడు. నిజానికి ఒక సామాన్యుడు పెట్టుబడులు పెట్టడానికి రకరకాల దారులు వెతుక్కుంటున్నాడు. కానీ ఈ రైతు తన వృత్తినే పెట్టుబడికి కూడా వాడుకొని మెరుగైన ఫలితాలు సాధించాడు.  

తన ఒక ఎకరంలోనే ఎన్నో పంటలు పండిస్తూ ఉన్న ఈ రైతు ప్రాంతీయంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 25 రూ. ఇస్తున్న వెదురు మొక్కలను(234) తెచ్చుకొని తన ఒక ఎకరంలో నాటాడు. దానిలో అంతర పంటలు కూడా వేస్తూ నాలుగేళ్లు మంచి ఫలితాలు సాధించాడు. తరువాత వెదురే ప్రధాన పంటగా ఉంచాడు. వేసిన ఒక్కో మొక్క నుండి 20-25 మొలకలు వేయడంతో చక్కటి ఫలితం వచ్చింది. స్థానికంగానే ఆ వెదుకు బొంగులకు 150రూ. ధర పలుకుతుంది. ఏడేళ్లలో వెదురు పంట చేతికి వచ్చేసింది. అంటే 234 మొక్కలు ఇప్పుడు (234*5011700*150=1755000) దాదాపు 50 పిలకలు వేసి మొత్తం 11700 వెదురు బొంగులు చేతికి వచ్చాయి. అంటే ఒక్కొక్కటి 150రూ. చొప్పున 1755000 సంపాదించాడు. ఇది షేర్ మార్కెట్ లో వచ్చే గొప్ప లాభాల కంటే ఎంతో ఎక్కువ. సేఫ్ కూడా. 150రూ. సాధారణ ధర, ఎక్కువ ఉంటె ఇంకా ఎక్కువ ఫలితాలు కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: