దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కొన్ని రంగాలు సంక్ష‌భాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలో కుబేరుల సంప‌ద మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. భార‌త్‌లో ఉన్న సంప‌న్నుల్లో ఒక‌రైన గౌత‌మ్ ఆదానీ, ఆయ‌న కుటుంబం సంప‌ద విలువ గ‌త సంవత్స‌రంలో ఏకంగా 261 శాతం పెరిగిపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హురున్ నివెధిక ఆధారంగా.. ఆదానీ, ఆయ‌న కుటుంబ సంపాద‌న రోజుకు వెయ్యి కోట్లు (రూ.1002) గా ఉంది. తొలిసారి ఆదానీ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఈ జాబితాలో టాప్‌-10లో ఉన్నారు.


     దేశంలో అపర అత్యంత సంప‌న్నుడ‌యిన రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఆస్తుల విలువ గత ఏడాది 9 శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరింది. రోజువారీగా అంబానీ ఆస్తుల విలువ రూ.163 కోట్లు పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ నివేదిక లో పేర్కొంది. పోయిన సంవ‌త్సరం రూ.1,40,200 కోట్లుగా ఉన్న గౌతమ్‌ అదానీ కుటుంబం ఆస్తుల విలువ.. ప్రస్తుతం భారీగా పెరిగి రూ.5 లక్షల కోట్లకు పైగా ఉంది. రోజువారీగా ఆ కుటుంబం సంపద విలువ రూ.వెయ్యి కోట్లు గా ఉంది. ఇలా ఏడాది కాలంలోనే వారి సంపద ఏకంగా 261 శాతం పెరిగింద‌ని  ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హురున్ నివెధిక వెల్ల‌డించింది.  దీంతో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ కుటుంబం రెండో స్థానానికి చేరుకుంది.


    హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ అధినేత శివనాడార్, ఆయన కుటుంబం సంపద కూడా భారీగానే పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 67శాతం పెరిగిపోయింది.   వారి సంపద రోజుకు రూ.260 కోట్లు పెరుగుతోంద‌ని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ నివేదిక ప్రకారం తెలుస్తోంది. రూ. 2,36,000 కోట్లతో దేశంలో ఉన్న కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్నారు.  హిందూజా సంస్థల గ్రూప్‌ అధినేత ఎస్‌పీ హిందూజా కుటుంబం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. రూ.209 కోట్లు నిత్యం వారి సంప‌ద పెరుగుతోంది. గతేడాదిలో వారి ఆస్తుల విలువ 53 శాతం మేర పెరిగింది.  దీంతో హిందూజా కుటుంబం సంప‌ద‌ విలువ రూ. 2,20,000 కోట్లుగా ఉంది.


 మిత్త‌ల్ కుటుంబం దేశంలో అత్యంత ధనవంతుల్లో ఐదో స్థానంలో నిలిచింది. లక్ష్మీనివాస్‌ మిత్తల్‌తో పాటు ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.1,74,000 కోట్ల‌కు చేరుకుంది.  కాగా గతేడాది వారి సంపదలో 187 శాతం పెరిగిపోయింది. వారి కుటుంబం నిత్యం సంపద వృద్ధి రూ.312 కోట్ల‌కు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: