బళ్లు ఓడలు మరియు ఓడలు బళ్లు అవడం కేవలం సంక్షోభంలోనే చూస్తూ ఉంటాం. కరోనా తెచ్చిన సంక్షోభం కూడా ఇలాంటి ఎన్నో అనుభవాలను దాదాపు అందరికి చూపించింది. ఇంకా చూపిస్తూనే ఉంది కూడా. అయితే ఈ సమయంలో బాగున్నాం అనుకున్న వాళ్ళు అట్టడుక్కి వెళ్లారు, మాకేముంది అన్నవాళ్ళు ఎక్కడికో వెళ్లారు. ఇవన్నీ ఆర్థిక పరమైన సంక్షోభం వలన మరియు ఆయా వ్యాపారాల వలన వచ్చిన ఒక విచిత్రమైన పరిస్థితులు. కరోనా లో దానికి సంభవించిన పరికరాలు, ఔషదాలు తదితర వాణిజ్యం బాగానే జరిగింది. మిగిలిన అన్ని కూడా దాదాపు దెబ్బ తిన్నట్టే.

అప్పుడే మొదలు పెట్టి తొలి అడుగు వేసిన వాళ్ళు మాత్రం ఇంకా ముందుకు వెళ్లే స్థితి లేక అల్లాడుతూనే ఉన్నారు. ఈ సంక్షోభానికి పెద్ద పెద్ద సంస్థలే తట్టుకోలేక ఉత్పత్తులు నిలిపివేసి కుర్చున్నాయంటే, అప్పుడే అడుగు వేసిన వాటి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా వలన ఒకవైపు వారు ఎంత పోగొట్టుకున్నారో మరోవైపు ఉన్నవారు అంతే లాభపడ్డారు అని చెప్పవచ్చేమో.! మాస్కుల నుండి శానిటైజర్ వరకు, ఆక్సిజన్ నుండి ఔషదాల వరకు, వాక్సిన్ నుండి ఇతర దుష్ఫలితాల నివారణకు తీసుకున్న అనేక ఔషదాలు ఇలా ఇవన్నీ కాస్త బాగానే పుంజుకున్నాయి.  

దీనితో భారత్ గత 75 ఏళ్లలోనే ఎన్నడు లేని విధంగా ఫార్మసీ రంగంలో ప్రపంచంలోనే ఉత్తమం గా నిలబడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో పోలియో సహా ఇతర అనేక వ్యాధులకు వాక్సిన్ ల తో అడ్డుకట్ట వేయడం, ప్రసూతి, పిల్లల మరణాలు తగ్గించడం, యూనివర్సల్ హెల్త్ కవరేజీ తో భారత్ ఫార్మసీ లో ఉత్తమంగా ఖ్యాతి గడించిందని చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్ సహా పలు దేశాలలో కరోనా తీవ్రమైన ప్రభావం చూపిందని ఆమె అన్నారు. పిల్లలలో పౌష్టికాహార లోపం ఉందని ఆమె అన్నారు. అలాగే భారత్ లో ఎక్కువ మంది ఐదేళ్ల పిల్లలు మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ ప్రకటించింది. కరోనా వలన ఈ సమస్య మరింత పెద్దది అయ్యిందని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: