సామాన్యుడి పాలిట‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు శ‌రాఘాతంలా మారాయి. ఓ వైపు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి.. మ‌రో వైపు వంటింట్లో గ్యాస్ బండ గుదిబండ‌గా మారింది.. ఇవి కావ‌న్న‌ట్టు రోజురోజుకు అలుపు లేకుండా ఆకాశాన్నంటుతున్న పెట్రోట్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో స‌గ‌టు జీవి ప్ర‌యాణం భారంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. మెట్రో న‌గ‌రాల‌తో పాటు అన్ని న‌గ‌రాల్లోనూ పెట్రో, డీజిల్ మంట‌లు భ‌గ్గుమంటూనే ఉన్నాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు త‌గ్గులు క‌నిపిస్తున్నాయి. పెట్రోల్‌పై 30 పైస‌లు, డీజిల్ పై 35 పైస‌ల మేర ధ‌ర‌లు పెరిగాయి. శుక్ర‌వారం తెలంగాణ‌, ఏపీలో పెట్రోల్, డీజిల్ ప‌రుగు కొన‌సాగుతోంది.


తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ మిన‌హా అన్ని న‌గ‌రాల్లో డిజీల్ ధ‌ర రూ.100 దాటేసింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌ల్లో మార్పుల వ‌ల్ల దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రోల్ డీజీల్ ధ‌ర‌ల‌ను మార్చుతున్నాయి.  తెలంగాణ రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.107.71 కాగా.. డీజీల్ సెంచ‌రీ దాటి రూ.100.51 గా ఉంది. ఖ‌మ్మంలో పెట్రోల్ రూ. 108.58, డీజీల్ 101.31 గా ఉంది. క‌రీంన‌గ‌ర్‌లో పెట్రోల్ ధ‌ర రూ.107.88 ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ.100.66 కు చేరుకుంది. మెద‌క్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ.108.84 గా ఉండ‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.100.92 కు చేరుకుంది. వ‌రంగ‌ర‌ల్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.107.40 ఉండ‌గా.. డీజీల్ మాత్రం రూ.99.67 ప‌లుకుతోంది.


అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో.. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.109.70 ఉండ‌గా, లీట‌ర్ డీజీల్ రూ.101.74 లుగా ఉంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.108.93 ప‌లుకుతుండ‌గా.. లీట‌ర్ డీజీల్ రూ.100.50 ప‌లుకుతోంది. విజ‌య‌న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ రూ.109.27 కు ల‌భిస్తుండ‌గా.. లీట‌ర్ డీజీల్ రూ.101.08కి ల‌భిస్తోంది. అలాగే మిగ‌తా కేంద్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.   ఇక దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేసాయి. దేశ రాజ‌ధాని ఢిల్లోలో లీట‌ర్ పెట్రోల్ ద‌ర రూ.103.54 ప‌లక‌గా.. లీట‌ర్ డీజీల్ ధ‌ర రూ.92.12 ప‌లుకుతోంది. ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.109.54 ఉండ‌గా.. లీట‌ర్ డీజీల్ ధ‌ర రూ.99.92 పైస‌లుగా ఉంది.









మరింత సమాచారం తెలుసుకోండి: