నిరుద్యోగుల‌కు ఓ దిగ్గ‌జ సంస్థ శుభ‌వార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ద్వితీయార్థం పూర్తిచేసుకునే లోపు నూత‌నంగా దాదాపు 35వేల మందిని రిక్రూట్ చేసుకుంటామ‌ని ప్ర‌ముఖ దిగ్గ‌జ‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఆ కంపెనీ ప్ర‌థ‌మార్థంలో 43వేల మందిని నియ‌మించిన‌ట్టు వివ‌రించింది. ద్వితీయార్థంలో 35వేల మందిని నియ‌మిస్తే మొత్తంగా ఆర్థిక సంవ‌త్స‌రంలో రికార్డు స్థాయిలో 78వేల మందిని రిక్రూట్‌మెంట్ చేసిన‌ట్టు అవుతుంద‌ని ఐటిరంగం, హెచ్ఆర్ అధికారి మిలింద్ ల‌క్క‌డ్ తెలిపారు.

టాటా కంపెనీకి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంద‌ని.. అందుకే ఈ నియామ‌కాల ప్ర‌క్రియ చేప‌డుతున్న‌ట్టు సీఈఓ రాజేష్ గోపినాథ‌న్ వెల్ల‌డించారు.  ప్టెంబ‌ర్ 30, 2021 నాటికి  5.28 ల‌క్ష‌ల  మంది ఉన్నార‌ని, అందులో మ‌హిళ‌లు  36.2 శాతం మ‌హిళ‌లున్నార‌ని తెలిపారు. రెండో త్రైమాసికంలో ముగిసిన ఫ‌ల‌తాల‌ను తాజాగా విడుద‌ల చేసింది. అందులో 9,624 కోట్ల లాభం వ‌చ్చిన‌ట్టు నివేదిక‌లో వెల్ల‌డించారు. వృద్ధిని 14.1 శాతం న‌మోదు అయింది. దీంతో సంస్థ ఆదాయం 16.7 శాతం పెరిగింది. రూ. 46,867కోట్లు చేరుకున్న‌ది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో రూ. 40,135 కోట్ల ఇన్‌క‌మ్ వ‌చ్చింది. దీంతో రూ. 8,433 కోట్ల నికర లాభం వ‌చ్చిన‌ట్టు ప్ర‌క‌టించారు.

దాదాపు శ‌తాబ్ద కాలం నుంచి త‌మ సంస్థను అభివృద్ది చేసుకుంటూ వ‌స్తున్నామ‌ని.. సీఈవో ఎండీ రాజేశ్‌ గోపినాథన్ తెలిపారు. సంస్థ‌ను బ‌లంగా అభివృద్ధిలో ముందు ఉంచేందుకు ప‌దేండ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే అవ‌కాశం అని వెల్ల‌డించారు. త‌మ బ్రాండ్ బ‌లోపేతం చేయ‌డానికి నిరంత‌రం కృషి చేస్తున్నామ‌ని.. ఐదేళ్ల‌పాటు రాజేష్ ను ఎండీ, సీఈవో గా నియ‌మించ‌డానికి బోర్డు ఆమోదం తెలిపింద‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 70 శాతం మంది రెండు టీకాలు వేయించుకున్నార‌ని యాజ‌మాన్యం వివ‌రించింది. ఇప్ప‌టికే చాలా మంది ఇంటి వ‌ద్ద ప‌ని చేస్తున్నార‌ని.. ఈ ఏడాది చివ‌రి నాటికి ఉద్యోగులంద‌రూ తిరిగి ఆఫీసుల‌కు వ‌చ్చి వ‌ర్క్ చేస్తార‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: