దేశంలో ఆర్థిక నేరస్తులపై సరైన చర్యలు తీసుకోకపోవడంపై ఇలాంటి చర్యలకు పాల్పడి, చక్కగా జీవితంలో స్థిరపడిపోవచ్చు అనే ఆలోచనలు చాలా మందిలో ఎక్కువ అయిపోతున్నాయి. అయితే అంతంత పెద్ద స్థాయిలో కాకపోయినా వారివారి స్థాయిలలో ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తూ బ్రతికేస్తున్నారు. ఇలాంటివారు ఇటీవల భారీగా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు అంటే ఆర్థిక నేరాలు పెద్దగా తరపైకి రాకముందు ఇలాంటి పనులు చేయడానికి కాస్త సంశయించేవారు, కానీ ఇటీవల అలాంటి పరిణామాలు ఏమి ఉండటం లేదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చక్కగా ప్రణాళిక బద్దంగా ఈ తరహా నేరాలు చేస్తూ, వైలైతే తప్పించుకోని విదేశాలకు వెళ్లి స్థిరపడిపోడం అనుకుంటున్నారు.

అయితే పెద్ద పెద్ద వాళ్ళు చేసే దానిలో బ్యాంకర్ల అత్యాశ ఉంటె, ఈ చిన్న చిన్న నేరాలలో ప్రజల అత్యాశ కనిపిస్తుంది. అధిక వడ్డీ వస్తుంది అని ఎవరైనా చెప్పగానే ఆలోచించకుండా ప్రజలు కూడా ఆయా సంస్థల వైపు పరిగెడుతున్నారు. ఉన్నదంతా వాళ్ళ చేతిలో పెట్టి వడ్డీ కోసం ఎదురుచూసేలోపే వాళ్ళు బోర్డులు తిప్పేస్తున్నారు. ఇలాంటివాటిలో మోసపోయిన వారికి చిన్న మొత్తలు కాబట్టి ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వాల గురించి తెలియనిది ఏముంది, అవి న్యాయం చేసే లోపు మోసం చేసినవాడు, మోసపోయినవాడు కూడా చనిపోగలరు, అంతలా ఉంటుంది ఆ సాయం.

తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన కరీముల్లా షేక్, స్వాతి నాగప్ప, ఆహ్లాద్ నాగప్ప లు కలిసి దేశంలో తాము అనేక వ్యాపారాలు చేస్తున్నట్టు నమ్మించి, బంజారాహిల్స్ లో అద్వైత్ గ్లోబల్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఒక కార్యాలయం తెరిచారు. అప్పటి నుండి ప్రజల వద్ద నుండి పెట్టుబడి, అధిక వడ్డీ అని నమ్మజూపి అనేక మంది చేత ఫిక్స్డ్ డిపోసిట్స్ కట్టించారు. కొన్నాళ్ళు ఇలా నమ్మించి పెద్ద మొత్తం(50కోట్లు) కాగానే దుబాయ్ చెక్కేశారు. అందులో మూడు నెలల నుండి ఏడాది కాలవ్యవధిలో డిపోసిట్స్ పెట్టారు ప్రజలు. కొన్నాళ్లుగా వడ్డీ రాకపోవటంతో తాము మోసపోయాం అని తెలుసుకొని కొందరు డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించారు. దీనితో ఇక్కడ సంస్థ చూసుకుంటూ ఉండిపోయిన స్వాతి, ఆహ్లాద్ ల పై నిఘా పెట్టి, పట్టుకున్నారు పోలీసులు. దుబాయ్ వెళ్లిన వాడి కోసం ఔట్ సర్కులర్ జారీచేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: