యూరప్ దేశాలలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. బ్రిటన్, జపాన్, చైనా, రష్యా  తదితర దేశాలలో ఈసారి కరోనా బాగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ కొత్త వేరియంట్లు వెలుగు చూడకపోయినప్పటికీ ఉన్న వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టగానే అప్పటివరకు పాటించిన జాగర్తలు అన్నిటిని పక్కన పెట్టడం తో పాటుగా ఎక్కవగా గుంపులుగా ప్రజలు ఉండటంతో ఆయా దేశాలలో వ్యాప్తి ఎక్కువ అయ్యిందని వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొన్ని దేశాలలో తగ్గినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ, యూరప్ దేశాలలో విజృంభణ కొనసాగుతుండటంతో వాళ్లలో జాగర్తలు పెరిగాయి. భారత్ లాంటి దేశాలలో కూడా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, విదేశీయుల నుండి లేదా ఇతరత్రా వ్యాప్తి కానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా కొత్త వేరియంట్ ఒకటి గుర్తించడం జరిగింది. అది అత్యంత త్వరగా మార్పులకు లోనవుతున్నట్టుగా కూడా వైద్యులు సమాచారాన్ని పంచుకున్నారు. దీనితో ఇతర దేశాలు జాగర్త పడేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమయంలో ఇలాంటి సమాచారం కొత్త వేరియంట్లపై వైద్యశాస్త్ర వేత్తలు అవగాహనా పెంచుకొవడానికి కూడా పనికి వస్తుంది. దానితో వాళ్ళు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా లు కావచ్చు ఔషదాలు కావచ్చు ఆయా వేరియంట్లపై పని చేస్తున్నది లేనిది తీర్మానించుకుంటారు. తద్వారా మరో అడుగు ముందుకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఒకవేళ ఈ వేరియంట్ టీకాలను కూడా తక్కుకుంటే, మరింత కాలం నివారణ చర్యలు పాటించాల్సిందని ప్రజలను హెచ్చరించవచ్చు, లేదు వేరియంట్ కంటే టీకా నే మెరుగ్గా ఉంటె, పెద్దగా ఆందోలన అవసరం లేదని స్పష్టం చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖ.

ఇలా కరోనా మరోసారి యూరప్ దేశాలలో ప్రభావం చూపుతుండటంతో అది భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనితో మరో శుక్రవారం బ్లాక్ డే గా భావిస్తున్నారు మదుపరులు. ఈ వారం కూడా కరోనా విజృంభణ వలన భారీ నష్టాలను చవిచూసింది స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 1687 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 500పైగా పాయింట్లు నష్టపోయింది. ఇంత భారీగా నష్టపోవడంతో ఈ శుక్రవారాన్ని కూడా బ్లాక్ డే గా నిర్ణయించారు. ఒక్క హెల్త్ కేర్ తప్ప అన్ని రంగాలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: