పాన్ కార్డు(శాశ్వత ఖాతా సంఖ్య) అవసరం చాలా ఉంటుంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా దానిని ఒక ఐడి గాను అలాగే ఇతర పన్ను విధానాలలోను అది చాలా ఉపయోగం. అయితే దానిని పొందటానికి మాత్రం మధ్యలో ఎందరో తయారవుతున్నారు. వాళ్లకు ఎంతో కంత ఇచ్చి, కావాల్సిన పత్రాలు ఇచ్చి, కొన్నాళ్ళు వేచి చూస్తే గాని అప్పుడు పాన్ దొరికేది. ఈ విధానంలో కాకపోయినా సదరు వ్యక్తి స్వయంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎంతో కంత సమయం పడుతుంది. అందుకనే ఇప్పటికే అంతా డిజిటల్ విధానం తెచ్చేసిన భారత్, ఈ విషయాన్ని కూడా అదే దిశగా జారీ చేయడం పట్ల దృష్టి పెట్టింది. ఈ విధానంలో ఆన్ లైన్ ద్వారా సదరు వెబ్ సైట్ లో కి వెళ్లి, కావాల్సిన పత్రాలు జతచేసి, అడిగిన వివరాలు అన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. తరువాత ఏదైనా సమాచారం సంస్థ నుండి ఆయా దరఖాస్తు దారులకు మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఇస్తారు. దానిని బట్టి పాన్ కార్డు, దరఖాస్తు సమయంలో ఇచ్చిన చిరునామాకు పోస్ట్ ద్వారా వస్తుంది.

ఈ విధానంలో కూడా కాస్త సమయం పడుతుంది అనేది వాస్తవం. ఇచ్చిన ధ్రువపత్రాలు సరిగా ఉన్నది లేనిది చూసుకోవాల్సి వస్తుంది. అనంతరం ఇతర ప్రక్రియ పూర్తిచేసి అప్పుడు పాన్ కార్డు జారీ చేయడం మొదలుపెడతారు. దీనిని కూడా సరళ తరం చేసేందుకు e-పాన్ విధానం తెచ్చేసింది ఆదాయపుపన్ను శాఖ. తద్వారా జారీ విధానంలో ఉన్న సమయం కూడా తగ్గిపోతుంది. కానీ ఒక్క షరతు మాత్రం ఉంది, అదే ఆధార్ అనుసంధానం(దీనికి కూడా మొబైల్ నెంబర్ అనుసంధానం అయి ఉండాల్సి ఉంది). దరఖాస్తు చేయు వ్యక్తి మేజర్ అయి ఉండాలి.  

e-పాన్ సులభంగా పొందే విధానం :
-------------------------------------------
* ఆదాయపు పన్ను వెబ్ సైట్ లో కి వెళ్లాల్సి ఉంటుంది. https://eportal.incometax.gov.in/iec/foservices/#/login
* వ్యక్తిగత సేవల టాబ్ లో తక్షణ e-పాన్ పై క్లిక్ చేయాలి
* e-పాన్ పేజీ లో గేట్ e-పాన్ పై క్లిక్ చేయండి.
* ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
* వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, దానిని నమోదు చేయాల్సి ఉంది.
* అనంతరం ఫోటో, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి.
* వివరాలు అన్ని సరిగా ఉన్నాయా అని ఒకసారి పరిశీలించుకుని, దరఖాస్తు సమర్పించాలి.
* అనంతరం భవిష్యత్తు లో ఉపయోగించడానికి దరకాస్తు నెంబర్ వస్తుంది, దానిని జాగర్త చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది పూర్తి ఉచిత సేవగా ఆదాయపుపన్ను శాఖ అందిస్తున్నది, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ సేవలు మీరు ఇతర ప్రభుత్వ సేవా సంస్థలు అయినటువంటి ఈ-సేవ, సచివాలయాలు నుండి పొందగోరవచ్చు. ప్రైవేట్ సేవా సంస్థలు కొంత మొత్తం రుసుము అడగవచ్చు. ఈ విధానం ద్వారా జారీ చేయబడిన e-పాన్ సాధారణ పాన్ లాగానే అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ e-పాన్ వచ్చిన తరువాత ఈ-కేవైసీ వివరాలు ఆధారంగా ఆయా ఖాతాను తెరవవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: