2022 సంవ‌త్స‌రంలో మీరు ధ‌న‌వంతులు అవ్వాల‌ని ఆలోచిస్తున్నారా..? స‌రైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీరు ఒక అవ‌కాశం అందుబాటులోకి రాబోతుంది. అది ఏమిట‌ని ఆలోచిస్తున్నారా..?  దేశంలోని అత్యంత సంప‌న్న‌డు, దిగ్గ‌జ వ్యాప‌ర‌వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ జియో ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్‌కు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. అన‌గా జీయో ఐపీఓ వ‌స్తోంది.  రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు ఆర్ఐఎల్‌కు చెందిన టెలికం విభాగం రిల‌య‌న్స్ జియో 2022 ఐపీఓకు రావోచ్చు అని సీఎల్ఎస్ఏ వెల్ల‌డించిది. ఈ నూత‌న సంవ‌త్స‌రంలో టెలికం రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకోవ‌చ్చుఅని పేర్కొన్న‌ది. 5జీ స్పెక్ట్రం వేలం, రిల‌య‌న్స్ జియో ఐపీఓ వంటి ఉండ‌వ‌చ్చ‌ని వివ‌రించింది. ఇప్ప‌టికే 33 శాతం వాటా ఇత‌ర కంపెనీలు కొనుగోలు చేసాయి.

జియోలో మొత్తం 13 మంది ఇన్వెస్ట‌ర్లు ఐపీఓ క‌న్నా ముందుగానే డ‌బ్బులు ఇన్వెస్ట్ చేసారు. ఫేస్‌బుక్ 10 శాతం వాటా కొనేసిన‌ది. గూగుల్‌కు 8 శాతం వాటా ఉన్న‌ది. సీఎల్ఎస్ఏ, జియో మొబైల్ బిజినెస్ 99 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌వ‌చ్చు అని అంచ‌నా వేసిన‌ది. అదే స‌మ‌యంలో జియో ఫైబ‌ర్ విలువ 5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌వ‌చ్చ‌ని లెక్క‌గ‌ట్టింది. కేంద్ర‌ప్ర‌భుత్వం ఇటీవ‌లే టెలికం రంగానికి సంస్క‌ర‌ణ‌ల ఫ్యాకేజ్ ప్ర‌క‌టించిన‌ది. అదే స‌మ‌యంలో టెలికం కంపెనీలన్నీ ఇటీవ‌లే టారిఫ్ ధ‌ర‌ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. అదేవిధంగా 5 జీ స‌ర్వీసులు కూడా ఈ సంవ‌త్స‌రంలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో జియో ఐపీఓకు రావొచ్చ‌నే అంచ‌నాలు నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు కేంద్ర ప్ర‌భుత్వం ఈసారి 5జీ స్పెక్ఱ్ర‌మ్ వేలంలో బేస్ ప్రైస్‌ను త‌గ్గించ‌వచ్చ‌నే అంచ‌నాలున్నాయి. టెల్కోల‌కు ఇది ఒక సానుకూలంశం ఇక‌పోతే జియో ప్లాట్ ఫామ్స్ ఇప్ప‌టికే 1.52 ల‌క్ష‌ల కోట్లు స‌మీకరించింది. అయితే ఫేస్‌బుక్‌, గూగుల్, ఇంటెల్ క్యాపిట‌ల్‌, క్వాల్‌కామ్ వెంచ‌ర్లు, సిల్వ‌ర్ లేక్‌, విస్తా ఈక్విటీ పార్ట్‌న‌ర్స్‌, జ‌న‌ర‌ల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి సంస్థ‌ల నుంచి ఈ నిధులు పొందిన‌ది. దీని కోసం 33 శాతం వాటా విక్ర‌యించింది.  ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభం పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: