ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు తరచూ ఉద్యోగాలు మారుతున్నారు.ఈ సమయంలో కూడా అన్ని రంగాల్లో రిక్రూట్‌మెంట్లు అనేవి జరుగుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది కొత్త కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. మీరు కూడా ఇలా చేస్తుంటే మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గురించి అస్సలు అజాగ్రత్తగా ఉండకండి, లేకుంటే ఇక మీరు రెట్టింపు నష్టాన్ని భరించవలసి ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగం నుండి నిష్క్రమించిన తర్వాత, మీరు మీ EPF ఖాతాలో ఎలాంటి లావాదేవీలు కనుక చేయకుంటే.. అది కేవలం కొంత సమయం వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. అదే సమయంలో లావాదేవీ లేకుండా ఖాతాలో పేర్కొన్న వ్యవధి తర్వాత డిపాజిట్‌పై సంపాదించిన వడ్డీ పన్ను విధించదగిన ఆదాయంగా కూడా మార్చబడుతుంది.ఇక ఉద్యోగాన్ని విడిచిపెట్టిన చాలా మంది వ్యక్తులు కూడా తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ పెరుగుతూనే ఉంటుందని, ఇంకా మూలధనం పెరుగుతూనే ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి ఇది నిర్ణీత కాలానికి మాత్రమే జరుగుతుందట. ఇక ఉద్యోగం నుండి నిష్క్రమించిన తర్వాత.. మొదటి 36 నెలల పాటు ఎటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కనుక డిపాజిట్ చేయకపోతే.. EPF ఖాతాఅనేది ఇన్-ఆపరేటివ్ ఖాతా కేటగిరీలో ఉంచబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు 3 సంవత్సరాలలోపు కొంత మొత్తాన్ని కచ్చితంగా విత్‌డ్రా చేసుకోవాలి.


ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసి, 36 నెలల్లోపు డిపాజిట్ ఉపసంహరణకు దరఖాస్తు కనుక చేసుకోకపోతే, అప్పుడు PF ఖాతా అనేది నిష్క్రియం అవుతుంది. కంపెనీని విడిచిపెట్టిన తర్వాత కూడా PF ఖాతాలో వడ్డీ అనేది జమ అవుతూనే ఉంటుంది. 55 సంవత్సరాల వయస్సు వరకు కూడా నిష్క్రియంగా ఉండదు.ఇక నిబంధనల ప్రకారం కంట్రిబ్యూషన్ మొత్తాన్ని జమ చేయకపోతే PF ఖాతా అనేది నిష్క్రియం కాదు. అయితే ఈ కాలంలో వచ్చే వడ్డీకి పన్ను అనేది వర్తిస్తుంది. 7 సంవత్సరాల పాటు నిష్క్రియంగా ఉన్న తర్వాత కూడా PF ఖాతాని క్లెయిమ్ చేయకపోతే.. ఆ మొత్తం కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కి వెళుతుంది. EPF, mp చట్టం 1952లోని సెక్షన్ 17 ద్వారా మినహాయించబడిన ట్రస్ట్‌లు కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ నియమాల పరిధిలోకి వస్తాయి. ఇక వారి ఖాతా మొత్తాన్ని కూడా సంక్షేమ నిధికి బదిలీ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: