ఇరానీ చాయ్‌ హైదరాబాద్ నగర సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయిందని చెప్పుకోవచ్చు. పొగలు కక్కే వేడి వేడి ఇరానీ చాయ్‌ను హైదరాబాద్‌ వాసులకు బాగా ఇష్టపడతారు. ఈ వేడి పానీయాన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇరాన్ ప్రజలు ఇలాంటి టీ తయారు చేసేవారు. అయితే కాలక్రమేణా హైదరాబాద్‌లో ఈ చాయ్ బాగా పాపులరైంది. బిస్కెట్లు, బన్ను, సమోసా ఇలా ఏదీ తింటున్నా ఇరానీ చాయ్ పక్కన లేకుండా ఉండలేరు భాగ్యనగర వాసులు.

వంద సంవత్సరాల క్రితం ఈ ఇరానీ చాయ్‌ భారతీయులకు పరిచయమైంది ఈ టీలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఆబిడ్స్‌లో ఉన్న "గ్రాండ్ హోటల్‌" 90 ఏళ్లుగా నడుస్తోంది. అయితే ఇక్కడికి ఇరానీ చాయ్ తాగేందుకే రోజూ వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అయితే ఈ చాయ్‌కి డిమాండ్ అయితే తగ్గలేదు కానీ ఇరానీ చాయ్ కేఫ్‌లు మాత్రం మూతపడుతున్నాయి.  సాధారణంగా ఈ కేఫ్‌లు ఇతర కేబుల్ కంటే చాలా విశాలంగా ఉంటాయి. బయట ప్రపంచం కనిపించేలాగా వీటిని నిర్మిస్తారు. అంతే కాదు ఫ్రెండ్స్ తో ఎంత సేపైనా కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా ఇక్కడ వాతావరణం స్పేస్ ఉంటుంది.

కానీ వీటిని చైన్ నెట్‌వర్క్ కేఫ్‌లు డామినేట్ చేస్తున్నాయి. అవి వైఫై సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. అంతేకాకుండా కోల్డ్ కాఫీ వంటి చాలా వెరైటీ కాఫీ, టీలు కూడా అమ్ముతున్నాయి. దీనివల్ల ఇరానీ చాయ్‌ కేఫ్‌ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఓన్లీ ఈ ఒక్క టీ మాత్రమే అమ్ముతానంటే ఏ కేఫ్‌ అయినా మూతపడాల్సిందే. ఇతర కేఫ్‌లు బిర్యానీతో పాటు మిగతా చాలా ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో టీ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందువల్ల ఇరానీ చాయ్‌ సేల్స్ ఎక్కువగా జరక్క ఆ స్టోర్లు మూతలు పడుతున్నాయి.

హైదరాబాద్‌లో కమర్షియల్ రూమ్స్, బిల్డింగ్స్ రెంటు ధరలు ఎక్కువగా పెరిగిపోయాయి. పాములు చాయ్ బిస్కెట్ల మీద సంపాదించే డబ్బుతో ఆ రెంట్‌ కట్టుకోవడం వ్యాపారులకు భారంగా మారుతుంది. అందుకే ఈ కేఫ్‌లను మూసేసి వెళ్ళిపోతున్నారు. టీ పొడి ధరలు కూడా పెరిగాయి రేటు ఎక్కువ పెడితే తాగే వాళ్ళు కరువయ్యారు. ఇరానీ కుటుంబాలు హైదరాబాద్‌ మంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు బాగా చదువులు చదువుకొని విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. అలా టీ తయారు చేసే వారి పిల్లలు వెళ్లిపోవడం వల్ల కేఫ్‌లు తగ్గిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: