మారుతున్న కాలంతో పాటు పత్రికా రచన కూడా అప్‌డేట్‌ అవుతోంది. అదే ,డిజిటల్‌ మీడియా .
చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు , మీడియా అరచేతిలో ఉన్నట్టే... ప్రింట్‌, మీడియా రంగాలకు ధీటుగా విస్తరిస్తోంది. జియో నెట్‌్‌వర్క్‌తో స్మార్ట్‌ ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెటి కనెక్టివిటీ అందుబాటులో ఉండటంతో, డిజిటల్‌ మీడియా, కొత్త పుంతలు తొక్కుతోంది.

ఆన్‌లైన్‌ వ్యవస్థ ప్రపంచ మంతటా చాప కింద నీరులా విస్తరించింది. ఇటీవల ఇంటర్నెట్‌ వినియోగదారులు అత్యధికంగా పెరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆన్‌లైన్‌ వీడియోలతో పాటు ఆడియో సేవలకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దేశీయ డిజిటల్‌ మీడియా రంగం ఈ ఏడు ఎంటర్‌టైన్మెంట్‌ రంగాన్ని అధికమించ వచ్చని ఫిక్కీ-ఈవైలు తమ అధ్యయనంలో వెల్లడించాయి.

1,వచ్చే రెండేళ్లలో ప్రింట్‌, మీడియాను డిజిటల్‌ మీడియా దాటేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. గత ఏడాదిలో 17 వేల 500 కోట్లు నమోదైన సినిమా ఇండస్ట్రీ ఈ ఏడాది మరో 2 వేల కోట్లు పెరగవచ్చని అంచనా.
2, గత ఏడాది(2018) 440 కోట్ల డాలర్లుంటే అంటే 30 వేల 800 కోట్లు ఉన్న ప్రచురణ , మీడియా రంగం 2021 నాటికి 480 కోట్ల డాలర్లకు చేరుకోనుందన్నమాట. దీని విలువ సుమారు 33 వేల 600 కోట్లు. 3, గత ఏడాది డిజిటల్‌ మీడియా మార్కెట్‌ 42 శాతం ప్రగతిలో 240 కోట్ల డాలర్లకు చేరుకుని.16 వేల 800 కోట్ల వద్ద ఆగింది.  వచ్చే రెండేళ్లలో 360 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేశారు.
4, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతీయులు భారీ ఎత్తున స్మార్ట్‌ ఫోన్లలోనే జీవితాన్ని గడిపేస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఒక సర్వే ప్రకారం 30 శాతం వినోదంలో మునిగి పోతున్నారట.
5, భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం పరిశీలిస్తే..57 కోట్లకు జనం ఇటర్నెట్‌ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఏటా 13 శాతానికి పైగా పెరుగుతూ వస్తోంది.
6, గత ఏడాది ఇండియాలో ఆన్‌లైన్‌లో వీడియాలోలను చూసే వారి సంఖ్య 32.5 కోట్లు నమోదు కాగా. మ్యూజిక్‌, తదితర ఆడియో సేవలు వినియోగించుకున్న వారు 15 కోట్లు పెరిగారు.
7, గత ఏడాది అడ్వర్‌టైజింగ్‌ ఆధారిత ఓటీటీ వీడియోలు, ఆడియో సేవల విలువ అమాంతం 220 కోట్ల డాలర్లకు చేరుకుంది.
8, వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్‌లో వీడియోలు చూసే వారి సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. 60 శాతానికి పైగా టెలికాం ఆపరేటర్ల కస్టమర్ల ద్వారానే మార్కెట్‌ జరుగుతుండడం విశేషం.
ఆన్‌లైన్‌లో గేమింగ్‌ వీడియోలు కూడా వీక్షకులను ఆకట్టుకోవడంలో తమ హవా కొనసాగిస్తున్నాయి.

'' వచ్చే మూడేళ్లలో డిజిటల్‌ మీడియా ప్రింట్‌ మీడియాను దాటి దూసుకెళ్లడం మాత్రం ఖాయం. పత్రికలు కొని చదివే తీరిక తగ్గుతుంది. వెబ్‌సైట్లు, న్యూస్‌ పోర్టర్లకు డిమాండ్‌ ఉంటుంది. ఎప్పటికపుడు వార్తలను, విజువల్స్‌ను వేగంగా తమదైన శైలిలో అందివ్వగలిగిన సంస్దలదే ఉజ్వల భవిష్యత్‌...!'' అని ఇటీవల ఢిల్లీలో జరిగిన బిబిసీ జర్నలిస్టుల సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ పాత్రికేయులు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: