అన్ని కాలాల్లోనూ లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది చాయ్ వ్యాపారం మాత్రమే.  తక్కువ ఖర్చు ఎక్కువ వ్యాపారం. లాభాలు కూడా అలానే ఉంటాయి.  ఇక యూనిక్ గా ఎవరైనా చాయ్ తయారు చేస్తున్నారు అంటే.. ఆ చాయ్ కు మరింత డిమాండ్ఉంటుంది .  హెర్బల్ టీకు ఇప్పుడు మంచి డిమాండ్.  


అలానే హెర్బల్ తో రకరకాల చాయ్ లు అందుబాటులో ఉంటున్నాయి.  ఇక వర్షాకాలం వచ్చింది అంటే రకరకాల అలర్జీలు వేధిస్తుంటాయి.  వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు చాయ్ దుకాణానికి వెళ్లి వేడివేడి టీ తాగుతుంటారు.  అప్పుడే హ్యాపీగా ఉంటుంది. శరీరంలో వేడి ఉండాలన్న చాయ్ అవసరం ఎంతైనా ఉంది.  


రకరకాల చాయ్ లు గురించి విన్నాం  .. చూశాం.  కానీ, పేపర్ చాయ్ గురించి ఎక్కడైనా చూశారా.. కనీసం విన్నారా.. అంటే  అందరు చెప్పేది నో అనే.  పూర్వకాలంలో కొన్ని రకాల ఆకుల్లో చాయ్ ను తయారు చేస్తుంటారు.  దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్నభాయ్ అనే వ్యక్తి పేపర్ తో చాయ్ తయారు  చేస్తూ..  అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.  


కాగితంతో చాయ్‌ చేయడం బ్రహ్మ విద్యేం కాదంటున్నాడు. నిప్పుల మీద నడిచే సూత్రమే ఇక్కడా పనిచేస్తుందని చెబుతున్నాడు. మంట పెట్టకుండా నిప్పులపై కాగితం కాలకుండా జాగ్రత్త తీసుకుంటే ఎవరైనా పేపర్‌ చాయ్‌ చేయొచ్చంటున్నాడు ఈ చిరువ్యాపారి.

ఒక్కసారి ఇక్కడ టీ రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ కావాలంటారని చెబుతున్నారు స్థానికులు. రోజుకు ఒక్కసారైనా ఇక్కడ తేనీరు సేవిస్తామని అంటున్నారు. రెండు దశాబ్దాలుగా టీకొట్టు నడుపుతున్న అన్నూభాయ్‌.. ప్రత్యేకంగా ఎవరైనా కోరితే పేపర్‌ చాయ్‌ తయారుచేసి ఇస్తున్నాడు. ఇంతకీ ఈ వింత ఎక్కడ జరిగిందని షాక్ అవుతున్నారా.. . ఆదిలాబాద్ జిల్లాలోని చందా టి గ్రామంలో ఈ వింత టి తయారు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: