భారతీయులకు బంగారంపై  మోజు ఎక్కువ. ప్రతీ ఒక్కరూ తమస్థాయి కి తగినట్లుగా బంగారాన్ని  కొనుగోలు చేస్తుంటారు .  పిల్లల పెళ్లిళ్లకు ఇతరాత్ర అవసరాలకు బంగారం ఉపయోగపడుతుందని భావిస్తుంటారు . అయితే ఇప్పుడిక సామాన్యుడికి బంగారాన్ని కొన్ని పరిస్థితులు కనిపించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  భూముల ధరలు చుక్కలు చూపించినట్లుగానే ,  బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.  ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటిసి జారీచేసే 10 గ్రాముల  మేలిమి బంగారు కాయన్  ధరలు ఏకంగా 430 50 రూపాయలు పలికింది .


దీనితో  బంగారం ధర సమీప  భవిష్యత్తులో 50, 000 తాకిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  మరోవైపు హైదరాబాద్   రిటైల్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 38,000 తాకింది.  ఆర్నమెంట్  22 క్యారెట్ల బంగారం  ధర 35 వేల 58 రూపాయలు పలుకుతోంది.  బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి, దేశీయ స్టాక్ మార్కెట్ లో అనిశ్చితి ఒక కారణమైతే ,   చైనా అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరొక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు .


బంగారం ధరలు రోజుకింత పై , పైకి వెళ్తుండడంతో వ్యాపారాలు గుండెలు బాదుకుంటున్నారు . ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సామాన్యులకు బంగారం ధరలు అందుబాటులో ఉంటేనే తమకు వ్యాపారం జరుగుతుందని , ఇలా నియంత్రణ లేకుండా ధరలు పెరిగితే తాము నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు . బంగారం ధరలు పెరగడం వల్ల సామాన్యులు కనీసం బంగారు ఆభరణాల దుకాణాల వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని కూడా చేయలేని పరిస్థితి నెలకొంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: