ఆటోమొబైల్‌ రంగంలో ఏర్పడుతున్న సంక్షోభం వల్ల అందులో పనిచేసే ఉద్యోగుల పరిస్దితి ఎండిపోయిన చేనులా తయారైంది.గడచిన కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులు తీవ్రరూపం దాల్చటంతో మూసివేతలు మొదలయ్యాయి.ఆటోమొబైల్‌ కంపెనీలు మరో గత్యంతరం లేక MANUFACTURING యూనిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.టీవీఎస్‌ గ్రూప్‌నకు చెందిన ఆటో కాంపోనెంట్‌ తయారీదారు సుందరం- క్లేటాన్‌ లిమిటెడ్‌,ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు వెల్లడించాయి.మరోవైపు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకీ భారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నానాటికి తగుముఖం పడుతుండటం ఇప్పటికే అమ్మకాలు లేక నిల్వలు పేరుకు పోవటంతో ఉత్పత్తిని నిలిపివేయటం మినహా ఆటోకంపెనీలకు మరో మార్గం లేకుండా పోయింది.




ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో ఇప్పటికే నేరుగా 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా,పరోక్షంగా మరో రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆటోమొబైల్‌ పరిశ్రమల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా 300కుపైగా డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని తెలిపింది.తాజాగా ఈ సంక్షోభం విశాఖను తాకింది..వివరాల్లోకి వెళ్లితే ఉద్యోగులను కుదించాలంటూ ఆదేశాలు జారీకావడంతో ఈ రంగం వ్యాపారులు,ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు.ఉదాహరణకు విశాఖ మహీంద్రా ఆటోమోటివ్స్‌లో 260 మంది ఉద్యోగులు,సేల్స్‌ మేనేజర్‌ కేడర్స్‌లో పనిచేస్తున్నారు.వీరిలో తక్షణం 40 మందిని తీసివేయాలంటూ హైదరాబాద్‌ కార్యాలయం నుంచి విశాఖ యాజమాన్యానికి ఆదేశాలు వచ్చాయిట.




గడచిన రెండు నెలలుగా పూర్తిగా అమ్మకాలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత సంస్థ అధికారి వెల్లడిస్తున్నారు.ఇదివరకు పెండింగ్ లో వున్న బిల్లులన్నీ క్లోజ్‌ చేయాలని,కొత్త ఆర్డర్లను తీసుకోవద్దని,ఉన్న స్టాక్‌ను ఎలా క్లియర్‌ చేయాలన్న విషయంపై దృష్టిసారించాలంటూ పైనుంచి ఉత్తర్వులు వచ్చినట్లు చెబుతున్నారు.ఇక మహీంద్రా ఆటోమోటివ్స్‌లో 40శాతం ఉద్యోగాలకు రాబోయే నెలరోజుల్లో ఉద్వాసనలు తప్పవన్న సంకేతాలు వెలువడ్డాయన్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని బ్రాంచీల్లో ఉద్యోగుల పనితీరు అసెస్‌మెంట్‌ను చేపడుతూ ఉద్వాసనకు మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు సంస్ద అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: