ఏదైన పనిలో కుదిరితే వారిచ్చే టైం ప్రకారం ఆపని చేయవలసి వుంటుంది.వచ్చే జీతం డబ్బులు ఈ జీవితానికి సరిపోవు. అంతేకాకుండా పోద్దున లేచి టిఫిన్ బాక్స్ కట్టుకుని, బస్సులోనో,బండిపైనో హడావుడిగా ట్రాఫిక్‌లో రయ్యిన దూసుకెళ్ళవలసి వస్తుంటుంది.నిజంగా ఎంత హడావుడిది మధ్యతరగతి జీవితం.ఇంత కష్ట పడ్డ నెల చివరకు మళ్లీ డబ్బుల కోసం లెక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది డబ్బులు సరిపోవడం లేదని.కాని ఈ మధ్య అలాంటి ఇబ్బందులు పడకుండా కాస్త ఓపికగా వుంటే అదనంగా డబ్బు సంపాదిం చుకునే మార్గాలు చాలా కనిపిస్తున్నాయి.ఏంచక్కా కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు.ఈ పనికి కేవలం మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు సులభంగానే డబ్బు సంపాదించే అవకాశం అందుబాటులో ఉంది.



ఇప్పుడున్న ఇంటర్నెట్,స్మార్ట్‌ఫోన్స్ పుణ్యమా అని ఇంట్లో కూర్చొని కదలకుండానే డబ్బులు సంపాదించే,పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి.అలాగే ఇటీవల కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌లో సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆదాయం కూడా బాగానే సంపాదిస్తున్నారు.అంతే కాకుండా ఇలా స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని నిమిషాలపాటు స్పెండ్ చేసినా డబ్బులు పొందొ చ్చు.ఎలాగంటే అడ్వర్టైజ్‌మెంట్లు,పేమెంట్స్ చెల్లింపులు,సర్వేలో పాల్గొనడం,వివిధ స్టోర్లలో షాపింగ్ వంటి పలు మార్గాల్లో డబ్బు సంపాదించొచ్చు.కాని మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేముందు వెబ్‌సైట్ విశ్వసనీయతను చెక్ చేసుకోవడం మంచిది. ఇక రెడినా ఐతే ఇప్పుడు ఇంట్లోనుండే మనీ ఎలా సంపాదించాలో తెలుసు కుందాం..ఇక మనకున్న సమయంలో మనీ సంపాదించే ఐదు యాప్స్ ఏంటో చూడండి..



వన్‌వన్‌డే (OneOneDay)
ఈ యాప్ సాయంతో యాడ్స్‌ రూపంలో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించొచ్చు.డబ్బుల్ని గిఫ్ట్ కార్డ్స్ లేదా క్యాష్ రూపంలో చెల్లిస్తారు... 
పేట్యూన్స్ (Paytunes)
ఇది ఆండ్రాయిడ్ యాప్.దీని సాయంతో పాత రింగ్ టోన్స్ టాటా చెప్పేసి కొత్త రింగ్ టోన్స్ సెట్ చేసుకోవచ్చు.ప్రతి ఇన్‌కమింగ్ కాల్‌కు కొంత మొత్తం మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.దీన్ని గిఫ్ట్ కార్డు లేదా క్యాష్ రూపంలో తీసుకోవచ్చు. 
టాస్క్‌బక్స్ (TaskBucks) 
ఇది ఆండ్రాయిడ్,ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్ రెండింటి మీద పనిచేస్తుంది.యాక్టివిటీస్,టాస్క్స్ పూర్తి చేయడం ద్వారా డబ్బు పొందొచ్చు.వచ్చిన డబ్బును పేటీఎం అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.లేదంటే మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు.క్విజ్ ఆడి కూడా సంపాదన పొందొచ్చు. 
లోప్‌స్కోప్ (Lopscoop)
ఈ యాప్‌లో చదవడం,షేర్ లేదా పోస్ట్ చేయడం వంటివి ఉంటాయి.పెద్ద సంఖ్యలోని లాల్ గిఫ్స్,ఫోటోలు,ఫన్నీ వీడియోలు సేవ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఉచిత పేటీఎం క్యాష్ పొందొచ్చు. 
క్రౌనిట్ (Crownit)
ఇది ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.కన్సూమర్ రోజూవారీ బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.గేమ్స్ ఆడాలి.ఆన్‌లైన్ సర్వేలను ఫిల్ చేయాలి.ప్రతిసారి స్క్రాచ్ కార్డులు గెలుచుకోవచ్చు.రివార్డు పాయింట్లు కూడా వస్తాయి.
చిన్న మాట ఏదైనా పని చేసేముందు కాస్త ఆలోచించి నిజనిజాలు తెలుసుకుని ప్రొసీడ్ అవ్వగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: