పిల్లల గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఫెడరల్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలను పరిష్కరించడానికి ఆల్ఫాబెట్ ఇంక్ యాజమాన్యంలోని గూగుల్ మరియు దాని యూట్యూబ్ వీడియో సేవ 170 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లల  తల్లిదండ్రుల అనుమతి లేకుండా కుకీలను ఉపయోగిస్తున్నారని, ఆ వీక్షకులకు పలు ప్రకటనలను పంపడం‌ ద్వారా మిలియన్ డాలర్లను సంపాదించడానికి  కుకీలను ఉపయోగిస్తున్నారని  ఆరోపించారు.


13 ఏళ్లలోపు పిల్లల గురించి సమాచారాన్ని సేకరించడాన్ని నిషేధించే చట్టం 1998 లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 2013 లో సవరించబడింది కుకీలను కూడా అందులో‌ ఉంచారు,  ఒక వ్యక్తి యొక్క ఇంటర్నెట్ వీక్షణ అలవాట్లను ట్రాక్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆల్ఫాబెట్ సంస్థ ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు వేసిన పన్ను  చాలా తక్కువ. ప్రకటన స్థలం, ప్రకటన సాంకేతిక పరిజ్ఞానం అమ్మకాల ద్వారా తమ ఆదాయంలో 85% సంపాదించే ఆల్ఫాబెట్, జూలైలో మొత్తం రెండవ త్రైమాసిక ఆదాయం 38.9 బిలియన్ డాలర్లు.

నాలుగు నెలల్లో పిల్లల కంటెంట్‌ను చూసే వ్యక్తుల నుండి సేకరించిన మొత్తం డేటాను పిల్లల నుండి వచ్చినట్లుగా భావిస్తామని యూట్యూబ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. "దీని అర్థం  పిల్లల నుండి సేకరించిన డేటా యూట్యూబ్ వాళ్ళకి అందించే   సేవలు ఇవ్వడానికి అవసరమైన వాటికి మాత్రమే పరిమితం చేస్తాము" అని యూట్యూబ్ తన బ్లాగులో తెలిపింది. 

ఛార్జీలను పరిష్కరించడానికి, యూట్యూబ్  170 మిలియన్ చెల్లించడానికి అంగీకరించింది, అందులో  136 మిలియన్లు F.T.C. మరియు న్యూయార్క్ కు 34 మిలియన్లు అందనుంది. ఈ మొత్తం F.T.C. ద్వారా పొందిన అతిపెద్ద జరిమానా. పిల్లల గోప్యతా కేసులో, సోషల్ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్ యజమానికి  ఈ సంవత్సరం విధించిన  5.7 మిలియన్ల  జరిమానా కన్న ఇది చాలా ఎక్కువ.


మరింత సమాచారం తెలుసుకోండి: