మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది.'నో ప్రొడక్షన్ డే'గా ఆ రెండు రోజులను ప్రకటించింది మారుతి. ఈ క్రమంలో ఉత్పత్తికి తగినంత స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో గురుగావ్, మనెసార్ ప్లాంట్లను ఈనెల 7, 9 తేదీల్లో రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వాల వైఫల్యాల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీని ఫలితంగా  ప్రముఖ కంపెనీలను సైతం వదలడంలేదు.. దీనిని నుంచి తప్పించుకోవడానికి కొన్ని సంస్థలు.. ఉద్యోగులను తప్పించుకునే పనిలో పడగా.. మరికొన్ని కంపెనీలు.. తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.





మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. అందువల్లే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆటో మొబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో క్రమంగా తన ఉత్పత్తులను తగ్గిస్తూ వస్తుంది మారుతి సుజుకి.. ఈ ఏడాది వరుసగా ఏడు నెలలోనూ తమ ప్రొడక్షన్‌ను తగ్గించడం గమనార్హం. ఆగస్టు నెలలో ప్రొడక్షన్ 33.99 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టు నెలలో సంస్థ ఉత్పత్తి చేసిన మొత్తం వాహనాలు 1,68,725 కాగా.. ఈ ఏడాది అగస్టులో అది 1,11,370కి పరిమితం చేసుకుంది. ఆల్టో, న్యూవేగన్ ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బలెనో, డిజైర్ కార్ల ఉత్పత్తి ఈ ఏడాది ఆగస్టు నెలలో 80,909 తయారయ్యాయి. 






గత ఏడాది ఇదే సమయంలో 1,22,824గా ఉంది. ఇక బ్రెజ్జా, ఎర్తిగా, ఎస్-క్రాస్ వంటి కార్ల ఉత్పత్తి కూడా 23,176 నుంచి 15,099కి తగ్గించుకుంది. అయితే, ఈ రెండు ప్లాంట్ల మూసివేత ప్రభావం మాత్రం తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ఉంటుందని అంటున్నారు. ఆటోమొబైల్ రంగంపై కూడా ఆర్ధిక మందగమనం ప్రభావం భారీగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గిపోయాయి. గత ఏడాది ఆగస్టులో మొత్తం 1,58,189 యూనిట్లను అమ్మిన మారుతి సుజికి.. ఈ ఏడాది ఆగస్టులో మాత్రం కేవలం 1,06,413 యూనిట్లకే పరిమితమైందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: