ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న ఏలబోతున్న టెక్నాలజీ ఇదే. కృత్రిమ మేథగా పిలుచుకునే ఈ టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు సృష్టించబోతోంది. అందుకే టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ ఈ రంగంవైపు దృష్టి సారిస్తున్నాయి.


ఇక టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కూడా ఇప్పుడు ఈ రంగంలో పరిశోధనలను తీవ్రం చేయబోతోంది. అందుకు వేదికగా మన బెంగళూరు నగరాన్ని ఎంచుకొంది. కృత్తిమ మేధకు సంబంధించిన పరిశోధనా కేంద్రాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేయాలని గూగుల్ డిసైడయ్యింది.


భారత మార్కెట్ కోసం ఉత్పత్తులను రూపొందించి వాటిని ప్రపంచ మార్కెట్లలోకి తీసుకెళ్లాలన్నది గూగుల్ ఆలోచన. అందుకోసమే తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ యూనిట్ ను బెంగళూరులో నెలకొల్పాలని డిసైడైంది.


వరల్డ్ బెస్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న యూత్ ఇండియాలో ఉన్నారు కదా.. అందుకే గూగుల్ బెంగళూరును సెలక్ట్ చేసుకుంది. ఇక ఈ రీసెర్చ్ ల్యాబ్ నుంచి ఏ అద్భుతాలు ఆవిష్కరణకానున్నాయో.. అవి ఏ మలుపులు తిప్పుతాయో..?


మరింత సమాచారం తెలుసుకోండి: