రాష్ట్రంలో పెట్టుబుడలు పెట్టేందుకు ఫ్రాన్స్‌కు చెందిన పారిశ్రామిక వేత్తల బృందం ఆసక్తి చూపింది. డైరీ డెవలఫ్‌మెంట్, ఆటో మొబైల్, స్పేర్‌ పార్ట్స్, ఎలక్రిక్‌ గ్రిడ్‌ ఆటోమేషన్, ఫౌల్ట్రీ, పుడ్‌ ఫ్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఫ్రెంచ్‌ పారిశ్రామిక వేత్తల ఆసక్తి చూపారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన 13 మంది ఫ్రాన్స్‌ పారిశ్రామిక వేత్తల బృందంతో విజయవాడలోని ఓ హోటల్‌లో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, విద్యుత్, భూగర్భగనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబులు బుధవారం భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ముఖ్యమంత్రి అధనపు ప్రధాన కార్యదర్శి పి వి రమేష్‌తో పాటు భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) రాష్ట్ర విభాగం ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక అభివృద్ధి మండలి(ఈడిబి) ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌కు చెందిన వాణిజ్య ప్రతినిధుల సమాఖ్య(మెడెఫ్‌) రాష్ట్ర పర్యటనకు వచ్చారు.



మంత్రులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలుత మాట్లాడిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రాష్ట్ర భౌగోళిక పరిస్ధితులను వివరిస్తూ సుదీర్ఘ సముద్ర తీరం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్‌ రోడ్‌ కనెక్టవిటీ, మానవ వనరులు పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నాయన్నారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆ తర్వాత మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ  రాష్ట్రంలో అగ్రి, పుడ్‌ ఫ్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయఅనుబంధ రంగాలలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫ్రెంచ్‌ బృందాన్ని కోరారు. జౌత్సాహిక పారిశ్రామిక వేత్తలు రాకకు, వారితో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. 



ఫ్రెంచ్‌ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన వికాట్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ ఛైర్మన్, సీఈఓ గై సిడోస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు తాము సిద్ధమని, నియమనిబంధనలు సరళంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వివిధ అంశాలమీద రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు ప్రధానకార్యదర్శి పీవీ రమేష్‌ ççసుదీర్ఘంగా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులుకు అనుకూలంగా ఉన్న సుదీర్ఘమైన తీరప్రాంతం, సీ పోర్టులు, ఎయిర్‌ పోర్టులతో పాటు జాతీయరహదారులకు వాటితో కనెక్టివిటీపై ఫ్రెంచ్‌ ప్రతినిధుల బృందానికి సమగ్రంగా వివరించారు. ఈ అంశాలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉంటాయని వారికి వివరించారు. కృష్టా, గోదావరి నదుల అనుసంధానం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, కోస్టాలో రిఫైనరీ పరిశ్రమలతో పాటు బకింగ్‌ హాం కాలువ పునరుద్ధరణ ద్వారా జలరవాణా మార్గంలో పెట్టుబడులును ప్రోత్సాహించే దిశగా  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి  నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అనంతరం ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనా«ద్‌ రెడ్డి, సీఏం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లు  ఫ్రెంచ్‌ ఫ్రతినిధుల బృందంతో మరోసారి పెట్టుబడుల అంశంపై రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్ధితులను వివరించడంతో పాటు వారు లేవెనత్తిన సందేహాలను నివృత్తి చేశారు. 



రాష్ట్రంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌ అప్‌గ్రెడేషన్, ఆటో మొబైల్స్‌ వాటి అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల ఉత్పత్తులు, పుడ్‌ ఫ్రాసెసింగ్, డైరీ, పౌల్ట్రీ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారికి వివరించారు. రాష్ట్రంలో ఏటా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ విభాగల నుంచి దాదాపు లక్షమంది విద్యార్ధులు పట్టభద్రులవుతున్నందు వల్ల రాష్ట్రంలో మానవవనరులు అపారంగా ఉన్నాయన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ద్వారా వారిలో  నైపుణ్యం పెంచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడుల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్న అలోచనతో ఉన్నారని సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ చెప్పారు.  ప్రభుత్వం, సిఐఐ, ఫ్రెంచ్‌ బృందం ప్రతినిధులు ఈ టాస్క్‌ ఫోర్స్‌ లో సభ్యులగా ఉంటారని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: