రెండున్నరేళ్ల క్రితం పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసినప్పుడు డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో ఒకటి పెట్రోల్ క్రెడిట్ కార్డు ద్వారా పోయించుకుంటే.. కొంత సొమ్ము క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో చాలా మంది వాహనదారులు క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోలు కొనుగోలు చేసేందుకు అలవాటుపడ్డారు.


అయితే ఇకపై మాత్రం అలాంటి క్యాష్ బ్యాక్ లు ఉండవట. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి. అక్టోబరు 1 నుంచి పెట్రోల్‌ బంక్‌ల వద్ద క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని.. సాధారణ రేటుకే పెట్రోలు పోస్తామని ప్రకటించాయి. ఇప్పటి వరకూ క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ కొంటే.. సుమారు..0.75శాతం క్యాష్‌బ్యాక్‌ వచ్చేది.


అదే సమయంలో పెట్రోల్‌ కంపెనీలు మరో శుభవార్త ప్రకటించాయి. ఇది కేవలం క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి మాత్రమేనట. అలా కాకుండా డెబిట్ కార్డు ద్వారా కానీ..ఇతర డిజిటల్ పేమెంట్లపై మాత్రం ఎప్పటిలాగానే డిస్కౌంట్ వస్తుందట. సో.. ఇక మీరు క్రెడిట్ కార్డుపై పెట్రోల్ కొట్టించుకోకుండా డెబిట్ కార్డు వాడితే బెటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: