ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి డబ్బు పై ఆశవుంటుంది.డబ్బు అంటే ఆశ వుండని వారెవ్వరు దాదాపుగా ఇక్కడ ఉండరు కూడా.కాని చాల మంది కష్టపడకుండానే డబ్బును సంపాదించాలని అనుకుంటారు.అది అంత సులువు కాదు.కాని అప్పుడప్పుడు తగిలే లాటరీల ద్వారా కొంతమంది వారి జీవితంలో డబ్బున్న వారిలా మారుతున్నారు.ఇక పోతే చాలా మందికి కోటీశ్వరులు కావాలని ఉంటుంది.


అందుకే డబ్బు సంపాదించడానికా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నా కూడా కాని ఇది అనుకున్నంత సులభం మాత్రం కాదు.కాని కొన్ని మార్గాల్లో ఎంతో కొంత డబ్బు కూడ పెట్టుకొవచ్చూ.అందులో కొన్ని సంస్దల్లో ఇన్వెస్ట్ చేయడం,స్టాక్ మార్కెట్‌ లో పెట్టుబడులు పెట్టడం లాంటి ఆప్షన్స్ మనకు అందుబాటులో వున్నాయి.ఐతే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు వారి ఇన్వెస్ట్‌మెంట్లను దీర్ఘకాలంలో కొనసాగించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తూ ఉంటారు.


ప్రత్యేకించి చిన్న ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను ఎక్కువ రోజలు కొనసాగిస్తే మంచి లాభం పొందొచ్చు.అందుకే  పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.ఇకపోతే మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి డైవర్సిఫికేషన్‌ అత్యంత ముఖ్యమైన విషయం.నష్టభయాన్ని తగ్గించడంలో డైవర్సిఫికేషన్‌ కీలకమైన పాత్ర పోషిస్తుంది.


డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాల కోసమే అసలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు.అయితే ఒక స్థాయికి మించిన తర్వాత డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు.మరీ మితి మీరితే అది డై వరస్ట్‌ ఫికేషన్‌ అవుతుంది. డైవర్సిఫికేషన్‌ మితిమీరితే మీ పోర్ట్‌ఫోలియో పనితీరు పేలవంగా ఉండే అవకాశాలూ ఉండొచ్చు.ఇక దీర్ఘకాలం లో ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే కనీసం 12 శాతం రాబడి పొందొచ్చంటున్నారు మార్కెట నిపుణులు.ఈ రాబడి కోసం కనీసం 10 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది.అయితే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాల జాగ్రత్తగా మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి.


ఇకపోతే హావెల్స్ ఇండియా షేరు ఇతర స్టాక్స్ కన్నా అధికంగా పెరిగింది.2004 అక్టోబర్ 4 నుంచి చూస్తే ఇప్పుడు అక్టోబర్ 3 నాటికి ఏకంగా 17,868 శాతం పెరిగింది. 2004 అక్టోబర్ 4న హావెల్స్ ఇండియా షేరు ధర కేవలం రూ.3.94గా ఉంది.ఇప్పుడు ఈ షేరు ధర రూ.704 స్థాయి వద్ద కదలాడుతోంది..కోటీశ్వరులు కావాలని భావించిన వారు ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ.1.78 కోట్లు గడించేవారు.ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా నమోదవుతూ ఉంటాయి.అన్ని షేర్లు పరుగులు పెట్టవు.కొన్ని కొన్ని సార్లు బాగా పెరిగిన షేర్లు కూడా పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్,ఆర్డర్ బుక్,బ్యాలెన్స్ షీటు,సంస్థ భవిష్యత్ ప్రణాళికలు,టెక్నికల్స్,ఎక్స్‌పొన్షియల్ మూవింగ్ యావరేజ్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.లేదంటే మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకోవడంమంచిది..ఇక ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌ ఏ కేటగిరీ కిందకు వస్తుందో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: