కొన్నేళ్ల క్రితం మనకు టివిలు అందుబాటులోకి వచ్చిన క్రొత్తలో ఎక్కువగా మనకు దూరదర్శన్ ఛానల్ కార్యక్రమాలు మాత్రమే లభించేవి. ఇక ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా ప్రైవేట్ ఛానల్స్ రాక, అక్కడినుండి అవి మరింతగా విస్తృతం చెందుతూ, నేడు మన దేశంలోనే ఏకంగా కొన్ని వందల టెలివిజన్ ఛానల్స్ పుట్టుకువచ్చాయి. అయితే వీటికి తగ్గట్లే ఇదివరకు కాస్త తక్కువగా ఉండే కేబుల్ ధరలు, ఇటీవల పెరుగుతూ వచ్చాయనుకోండి. ఇక కేబుల్ కు గట్టి పోటీని ఇస్తూ మధ్యలో డిటిహెచ్ ల వంటివి ప్రవేశించడంతో కేబుల్ ఆపరేటర్లకు కొంత గండి కొట్టడం జరిగింది. ఇకపోతే ఇటీవల ట్రాయ్ సంస్థ ప్రత్యేకంగా ఏ ఛానల్ కి ఆ ఛానల్ ని విడివిడిగా కొనుగోలు చేసుకుని వీక్షించవచ్చు అనే నిబంధన తీసుకురావడంతో, తాము చూసే ఛానల్స్ సంఖ్య పెరగంతో వాటన్నిటికి కలిపి సదరు వినియోగదారుడు నెలకు దాదాపుగా రూ.400 వరకు చెల్లించుకుంటున్నారు. ఇది దిగువ మరియు మధ్యతరగతి వారికి కొంత భారంగా మారుతోంది. 

అయితే నేడు కొందరు టెక్ నిపుణుల నుండి అందిన సమాచారం ప్రకారం, కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు కెవ్వు కేక అనిపించేలా ఓ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. దాని ప్రకారం, రూ.130కే ఏకంగా 150 ఛానెళ్లను అందించేందుకు కేబుల్ ఆపరేటర్లు సరికొత్త ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ.130ను వసూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడిసిఎఫ్) ఇండియాలోని 80 శాతం కేబుల్ యూజర్లకు సేవలు అందిస్తుండగా, ఈ ఫెడరేషన్ లో సభ్యత్వం కలిగి ఉన్న హాత్వే డిజిటల్ ఇన్డిజిటల్ సిటీ నెట్ వర్క్ జీటీపీఎల్ హాత్వే ఫాస్ట్వే ట్రాన్స్మిషన్ డీఈఎన్ నెట్ వర్క్ యూసీఎన్ కేబుల్ ఆర్టెల్ కమ్యూనికేషన్స్ ఐసీఎన్సీఎల్ ఏషియానెట్ డిజిటల్ కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయి, 

రూ.130కే 150 ఛానెళ్లను యూజర్లకు అందించాలనన్న విషయంపై చర్చించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారట. దీని ప్రకారం ఇకపై 150 ఛానెల్స్ ని అతి తక్కువ ధరలకే అందించనున్నారు. అంటే ట్రాయ్ షరతుల ప్రకారం రూ.170 చెల్లించే వినియోగదారులకు 150 ఛానెళ్లను అందిస్తారు. అయితే ట్రాయ్ నిర్దేశించిన రూ.130కి 100 ఛానెళ్లకు బదులుగా ఏకంగా రూ.130కే ఏకంగా 150 ఛానెళ్లను వినియోగదారులకు అందించేలా కేబుల్ ఆపరేటర్లు ఆల్మోస్ట్ రెడీ అయ్యారట. అయితే దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రావడం, ఆపై ఇది వినియోగదారులకు అందుబాటులోకి రావడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఇది కనుక అమల్లోకి వస్తే, సాధారణ ప్రజలకు కేబుల్ మరింత అందుబాటులోకి రావడం ఖాయం అనే చెప్పాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: