ఎల్ ఐ సీ.. దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ. కానీ ఈ సంస్థ పని తీరు బాగా లేదని.. త్వరలోనే దివాలా తీయబోతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎల్ ఐ సీలో పెట్టుబడులు ఉంటే వెనక్కి తీసుకోవాలని ఆ సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి.


అయితే ఈ వార్తలను ఎల్ ఐ సీ పూర్తిగా ఖండిస్తోంది. తన ఆర్ధిక పరిస్థితి బాగా లేదంటూ సామాజిక వేదికల్లో ప్రచారం అవుతున్న విషయాలను నమ్మొద్దని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వదంతులు పాలసీదార్లను తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంతో పాటు, వారిలో ఆందోళన కలిగిస్తున్నాయని ఎల్ ఐ సీ పేర్కొంది.


ఎల్ఐసీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంతమంది పనిగట్టుకొని వీటిని ప్రచారం చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు మొత్తం రూ.50,000 కోట్ల బోనస్ ప్రకటించినట్లు ఈ సందర్భంగా తెలిపింది. అంతే కాదు. ఆగస్టు 2019 నాటికి మొత్తం పాలసీల్లో ఎల్ ఐసీ వాటా 72.84 శాతం ఉందని మొదటి ప్రీమియం వసూళ్లలో 73.06 శాతం వాటా సాధించినట్లు వెల్లడించింది.


అందుకే ఇలాంటి పుకార్లను నమ్మి.. పాలసీదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరింది. అంటే సోషల్ మీడియా ప్రచారం అంతా వట్టిదేనన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: