పెట్రోల్, డీజిల్ ధరలు ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉండే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మొన్నటివరకు భారీగా తగ్గుతూ వచ్చాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నెల క్రితం వరుకు 80 రూపాయిలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధర ప్రస్తుతం 76 రూపాయలకు చేరింది. అలానే డీజిల్ ధర కూడా 70 రూపాయలకు చేరింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.45 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.61 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.94 వద్ద, డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.64.76కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబయిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.93కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై నాలుగు రూపాయిలు తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: