ఆన్​లైన్​ వ్యాపార దిగ్గజం అమెజాన్ గురించి పరిచయం చేయనవసరం లేదు. ఆ కంపెనీలో ప్రతీది సంచలనమే. ఉత్తమమైన ఉత్పత్తులకు ఆ సంస్థ పెట్టింది పేరు. అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు అయిన జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ నుంచి తీసుకున్న విడాకులు సైతం అంతే సంచలనం. అదే సమయంలో అమెజాన్‌‌ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం అంతే సంచలనం. తమ పని పరిస్థితులు మెరుగుపర్చాలనీ, జీతాలను పెంచాలనీ డిమాండ్‌‌ చేస్తూ అమెరికా, ఇంగ్లండ్‌‌, జర్మనీ తదితర దేశాల్లో ఆందోళనలు చేశారు. ఇలాంటి అనేకానేక సంచలన వార్తల్లో తాజాగా మరో సంచలన వార్త తెరమీదకు వచ్చింది.

అమెజాన్‌ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అమెజాన్‌ ఇండియా విభాగం ఫుడ్‌డెలివరీ వ్యాపారంపై చాలా అసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఉబర్‌ అనుబంధ సంస్థ ఉబర్‌ ఈట్స్‌ ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇది సాధ్యం కాకపోతే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ఏర్పర్చుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ఉబర్‌ నిరాకరించింది. 

కాగా, గత వారం  ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ పని పరిస్థితులు మెరుగుపర్చాలనీ, జీతాలను పెంచాలనీ డిమాండ్‌‌ చేస్తూ అమెరికా, ఇంగ్లండ్‌‌, జర్మనీ తదితర దేశాల్లో సోమవారం నుంచి ఆందోళనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక డిస్కౌంట్లతో అమెజాన్‌‌ డిస్కౌంట్లతో ప్రత్యేక సేల్‌‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అమెరికాలోని మినియాపోలిస్‌‌ వంటి నగరాల్లోని అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్‌‌లోని ఉద్యోగులు సోమవారం ఆరు గంటలపాటు విధుల నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో పనులు నిలిచిపోయాయి.  పని గంటలు ఎక్కువ ఉన్నాయని, జీతాలు తక్కువ ఉన్నాయని గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, కంపెనీ పనిభారాన్ని మరింత పెంచిందని ఉద్యోగులు ఆరోపించారు. అమెజాన్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 24 గంటల్లోపు డెలివరీ ఇస్తామనే కంపెనీ హామీతో తమ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిందని ఉద్యోగులు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: