రోజురోజుకూ , వాహనాల వాడకం పెరిగిపోవడంతో వాయు కాలుష్యానికి దారితీస్తుంది. అయితే డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాలను వినియోగిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.  నిజానికి భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదే. 


1, దేశీయ ఆటో రంగ కంపెనీ, టాటా మోటర్స్.. ఆల్ట్రా ఈవీ పేరుతో విద్యుత్ బస్సును రూపొందించింది. రెండున్నర గంటల్లో బస్సు ఫుల్‌గా చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. విద్యుత్ బస్సుతో పోల్చుకుంటే 100 కి.మీ దూరం ప్రయాణించేందుకు డీజిల్ బస్సుకు రూ.1.400 వరకూ ఖర్చు అవుతుంది. అదే విద్యుత్ వాహనాలకైతే ఈ ఖర్చు రూ.500 నుంచి 600లే. 
2, రాబోయే కాలంలో వంద శాతం విద్యుత్ వాహనాలే వినియోగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. విద్యుత్ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తయారీ, అమ్మకాలపై పన్నుల రాయితీ ప్రకటించడం. రోడ్డు పన్నులను తగ్గించడం వంటి ప్రోత్సాహకాలెన్నింటినో ప్రభుత్వం అందిస్తున్నది. వీటికి నేషనల్ పర్మిట్ ఉండబోదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రవాస్-2019లో స్పష్టం చేశారు. 


3, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విద్యుత్ వాహనాలదే హవా అని స్పష్టమవుతున్నది. దీని ద్వారా ఉద్యోగాల కల్పనలో కీలక ప్రాత పోషిస్తున్న రవాణా రంగం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్నీ గణనీయంగా నియంత్రించవచ్చు.


4,  రానురాను వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఎక్కువవుతున్నది. ప్రజా రవాణాకు షేర్ ఆటోలనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.  పెద్ద నగరాల్లో ప్రజా రవాణా చాలా కష్టతరమైన పని. కానీ దీన్ని బస్సుల వినియోగంతో అధిగమించవచ్చు.


5,  లండన్ వంటి పెద్ద నగరాల్లోనూ ట్రాఫిక్ సమస్య, వాయు కాలుష్యం వంటివి లేకపోవడానికి కారణం ప్రజా రవాణాకు బస్సులను వాడుకోవడమే. కోటి మంది నివసిస్తున్న లండన్‌లో 16 వేల బస్సులున్నాయి. 80 శాతం డబుల్ డెక్కర్ బస్సులే. లండన్ నగరంలో వ్యక్తిగత వాహనాల రవాణా చాలా తక్కువగా ఉంటుంది.


6,  ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా విద్యుత్ బస్సులను ప్రజా రవాణా కోసం వినియోగిస్తున్నారు. మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వీటి సంఖ్య మరింత పెరుగనుండగా, తగ్గే డీజిల్, పెట్రోల్ ఆధారిత వాహనాలతో వాయు కాలుష్యం అదుపులోకి వస్తుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: