ఉరుముతున్న వర్షంలో వేడి వేడి పకోడీ ఉంటే ఆహా !! స్వర్గం కనిపిస్తుంది కదా??? మరి  అదే సమయంలో ఒక కొత్త రకం / రొటీన్ కి భిన్నంగా  ఒక   రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన సూప్ చేస్తే ?????  అద్భుతః
మరి ఇంతకీ కొత్త సూప్ ఏంటి అంటారా.....
టమాటో, మిక్స్డ్ వెజ్జీస్ , మష్రూమ్, కార్న్, ఇవ్వని  తరచుగా ఉండేవే, ఈరోజు మనకి పరిచయం అవుతుంది కొత్త సూప్ - బీట్రూట్ సూప్.
ఏంటి బీట్ రూట్ తో  నా అనుకోకండి , ఒకసారి  ట్రై చేశారంటే  ఇంకా మీ ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారు.....
మరి దానికి కావాల్సిన పదార్థాలు మరియు చేసే విధానం ఇదిగోండి....
 
కావలసిన పదార్థాలు:
బీట్రూట్ - 2
బంగాళదుంప -  1 చిన్నది
టమాటా - 2
క్యారెట్  - 1
మిరియాల పొడి - 1 చెమ్చా / 1 టేబుల్  స్పూన్
సోంపు పొడి  - 2 చెంచాలు/2  టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
బ్రెడ్ స్లైస్ - 1 (చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి)
బట్టర్/ నెయ్యి- బ్రెడ్ స్లైస్ కి సరిపడా
నీళ్లు - సరిపడా
 
తయారు చేసే విధానం:
 ముందుగా బీట్ రూట్,బంగాళదుంప, కార్రోట్ ని చెక్కు/ పొట్టు తీసి పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి, వాటితో పాటు టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి.  తరిగిన కూరగాయలు మొక్కలన్నిటిని  ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఒక  4 - 5 విజిల్స్ లోకి  పెట్టాలి. ఉడికిన    మిశ్రమాన్ని చల్లర్చుకొని జ్యూస్ జార్ లో వేసి మిక్సీ పట్టాలి,అవసరం  పడితే కొన్ని నీళ్లు కలుపుకుంటూ మిక్సీ పట్టొచ్చు (గమనిక: ఈ మిశ్రమం చాలా జారుడుగా/పల్చగా ఉండాలి)
వచ్చిన మిశ్రమాన్ని వడియగట్టి,ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 -10నిమిషాల పాటు మరగనీయాలి.
మరుగుతున్న సమయంలో మిరియాల పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి కాసేపు ఉంచి  తీసేయాలి.
పక్కనే ఒక చిన్న బాణలిలో కొంచెం బట్టర్ లేదా నెయ్యి వేసి చిన్నగా  తరుగుతున్న బ్రెడ్ ముక్కల్ని క్రిస్పీ గా  వేయించి పెట్టుకోవాలి.
ఇప్పుడు సర్వ్ చేసే ముందు ఆ మిశ్రమంలో/ తయారైన  సూప్ లో  ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని వేసి పై నుంచి ఒక 2 కొత్తిమీర రెమ్మలు వేస్తే బీట్రూట్ సూప్ రెడీ.
దీన్ని వేడి వేడిగా  ఆస్వాదిస్తే ఉంటుంది సూపరో.......సూపర్………

మరింత సమాచారం తెలుసుకోండి: