డబ్బు బంధాలనే త్రుంచేస్తుందని ఇన్నాళ్లు భావించాం.. కానీ నేడు అది కాస్త ఒకడుగు ముందుకేసింది. బంధాలను త్రుంచడంతో పాటుగా వారిని కసిగా చంపేందుకు కూడా వెనకాడటం లేదు. డబ్బుల కోసం ప్రాణంగా ప్రేమించే స్నేహితులను.. కన్నవారిని కడతేడ్చడానికి కూడా వెనకాడటం లేదు నేటి సమాజం. డబ్బుల కోసం ప్రాణంగా ప్రేమించే స్నేహితుడి ప్రాణమే తీసాడు ఓ కిరాతకుడు. రెండేళ్ల స్నేహం మరిచి.. అతి కిరాతకంగా పీకకోసి ప్రాణం తీసాడు. గొంతు కోసి..  నొప్పితో ఆ స్నేహితుడు విలవిలలాడుతున్నా.. ఎలాగో కొద్ది సేపట్లో చచ్చిపోతావ్.. ఇప్పుడన్నా ఏటీఎం పిన్ నెంబర్ చెప్పి చావరా.. అంటూ బ్రతిమిలాడాడు ఈ కిరాతకుడు.. చివరి క్షణాల్లో ఉన్నా.. అతడు ఏటీఎం పిన్ నెంబర్ మాత్రం చెప్పలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో  ఇంజనీర్ ను తన స్నేహితుడే చంపిన ఘటన బాపట్ల శివారులో చోటుచేసుకుంది. విజయవాడ చెన్నై మూడో రైల్వే లైన్ ప్రజెక్టు పనులను  జీఆర్ ఇన్ ఫ్రా సంస్థ నిర్వహింస్తోంది. ఇందులో చాలా మంది ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు ఈ సంస్థ అవకాశం కల్పించింది.
ఈ క్రమంలోనే ఛత్తీస్ ఘడ్ లోని భిలాయి ప్రాంతానికి చెందిన యువరాజ్ కూడా ఇందులో ఇంజనీర్ గా ఉద్యోగం పొందాడు. విశ్వకర్మ బాపట్ల, పొన్నూరు మధ్య రైల్వేట్రాక్ నిర్మాలను పనులను పర్యవేక్షించే ఇంజనీర్ గా యువరాజ్ పనిలో కొనసాగుతున్నాడు. ఇతని తో పాటుగా అమరజీత్ మండల్ కూడా ఆ సంస్థలోనే  పంప్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతను బెంగాల్ లోని ముర్షీదాబాద్ కు చెందిన వాడు. కాగా ఒకే దగ్గర పనిచేయడంతో వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కాగా ఈ మధ్యనే అమరజీత్ బైక్ పై వెలుతూ.. చీరాల సమీపంలో ఓ  వృద్ధురాలిని ఢీ కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం విడిచింది. కాగా ఈ కేసులో రాజీకి రావడానికి అతనికి రూ. 2 లక్షలు అవసరమయ్యాయి. దాంతో అమరజీత్ యువరాజ్ విశ్వకర్మను డబ్బులను అడిగాడు. కానీ యువరాజ్ మాత్రం దానికి అంగీకరించలేదు. డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కక్ష్య పెంచుకున్నాడు అమరజీత్.. దాంతో ఎలాగైనా అతని నుంచి డబ్బులు తీసుకోవాలని పథకం పన్నాడు.

కాగా ఈ నెల 23న వారిద్దరు పొన్నూరు క్యాంప్ నుంచి వచ్చే క్రమంలో యువరాజ్ అమరజీత్ తో డబ్బుల విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అమరజీత్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో యువరాజ్ గొంతు కోసాడు. తీవ్ర రక్త స్రావంతో యువరాజ్ విలవిలలాడుతున్నా అమరజీత్ మాత్రం ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలంటూ వేధించసాగాడు. అయినా యువరాజ్ పిన్ నెంబర్ చెప్పలేదు. దాంతో యువరాజ్ కి పోపం పీక్స్ కు వెళ్లింది. ఇంకేముంది ఇంకోసారి యువరాజ్ గొంతు కోసి చంపాడు. అలాగే డెడ్ బాడీని సమీపంలోని బ్రిడ్జ్ కింద పూడ్చాడు. అయితే విధుల్లోకి అని వెళ్లి యువరాజ్ క్యాంప్ లో కనిపించకపోవడంతో జీఆర్ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాగా సీసీటీవీ పుటేజీ చూసి పోలీసులు అమరజీత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అమరజీత్ తన నేరాన్ని అంగీకరించాడు.  దీంతో అతనిపై హత్య కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: