గత కొద్దిరోజుల నుంచి ఏ న్యూస్ ఛానల్ చూసినా,  ఏ పేపర్ చూసినా తాలిబాన్ తాలిబాన్ తాలిబాన్.. తాలిబాన్ పేరే ప్రపంచమంతా మార్మోగిపోతోంది. అంతటి క్రూరమైన  మనుషుల మధ్య ఆఫ్ఘనిస్తాన్ పాలన చాలా కఠినంగా సాగుతోంది. తుపాకుల మధ్య ఆఫ్ఘనిస్తాన్ దేశం చిన్నాభిన్నం అవుతుంది.  ఇప్పటికే దేశం మొత్తం విస్తరించిన తాలిబన్లు వారి యొక్క కఠిన చట్టాలను అమలు చేసి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఇందులో మహిళలపై అయితే తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి. పది సంవత్సరాల నుంచి మొదలు 45 సంవత్సరాల వరకు మహిళలను వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వారు పెట్టిన అంశాలతో మహిళలు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. కానీ కొన్ని చోట్ల  తాలిబన్ల పై తిరుగుబాటు దాడి మొదలైందని చెప్పవచ్చు.  ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ అంతా తమ చేతుల్లోకి తీసుకున్న టువంటి తాలిబన్లు,  వారి యొక్క క్రూరమైన ఆలోచనలతో ప్రజలను హింసిస్తున్నారు.

 కొన్ని చోట్ల వారి అరాచకాలను తట్టుకోలేక వారికి తిరుగుబాటు చేస్తున్నారు.  ఈ తరుణంలోనే 11 మంది తాలిబన్లను బంగ్లాన్ రెబల్స్ హతమార్చారు.  ఇందులో తాలిబన్ కమాండర్ తో పాటు మరో ఏడుగురిని  బంధించారు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్  వారి చేతుల్లోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లేట్ అని వారు  అనుకుంటున్న తరుణంలో ఈ తిరుగుబాటు ప్రారంభం అవడం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు.  ఇప్పటికే మూడు జిల్లాల నుంచి తాలిబన్లకు తిరుగుబాటు దాడి ఎదురైంది.  ఈ యొక్క దాడితో తాలిబన్లకు ముందు ముందు ప్రమాదం తప్పదని అర్థం చేసుకోవచ్చు.  దీంతో పాటుగా ఫ్రాంజిచిర్  లోయలో కూడా తాలిబాన్ లకు తిరుగుబాటు దాడి ఎదురయింది.

ఎత్తయిన పర్వతాలు ఆ ప్రాంతానికి పెట్టిన కోటలు.  మరోవైపు మహమ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన వస్తుండడంతో దీంతో ఫ్రాంజిచిర్ స్వాధీనం చేసుకోవడంలో తాలిబన్లు విఫలం అవుతున్నారని చెప్పవచ్చు.  ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం తాలిబన్లకే కాదు, గతంలో 1990 లో సోవియట్ యూనియన్ రష్యా కూడా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే దీనిపై తాలిబన్లు ఇంకా ఏ విధమైన వ్యూహాలతో ముందుకు పోతారు అనేది,  ఇలాంటి పరిస్థితులు ఆఫ్ఘన్ ప్రజల ఎదుర్కొంటారు  అనేది ముందు ముందు కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: