మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా నాలుగు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ఇక ఆ ఇంట్లో కాసేపట్లో పెళ్లిభాజాలు మోగుతూ బంధువులతో సందడిగా మారింది. అయితే అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి వరుడు ఇంటికి వెళ్తున్నారు. కాగా.. కొద్దిసేపట్లో కల్యాణవేదిక వద్దకు చేరుకోనున్నారు. ఇక ఇంతలోనే ఊహించని విషాదం ఆ కుటుంబంలో అలుముకున్నాయి. అంతసేపు పెళ్లిసందడిని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందో ఏమో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే పెళ్లి వారితో వెళ్తున్న వాహనం నుంచి జారిపడి నలురుగు మృత్యువాత పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా తుర్లపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు వద్ద హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలైయ్యాయి. అయితే త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి వధువును తీసుకొని పొదిలిలోని అక్కచెరువుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఒక్కసారిగా వాహనం వెనుకున్న డోర్ తెరుచుకోవడంతో వెనుక కూర్చున్నవారు రోడ్డుపై పడ్డారు. ఇక వీరిలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. కాగా.. గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో మృతి చెందిన శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లింటితో పాటు మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

కాగా.. వధువు వాహనం ముందుభాగంలో కూర్చోవడం ఆమె ప్రమాదం నుంచి బయటపడింది.అయితే బుధవారం ఉదయం 11గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహం జరగనున్నది. కానీ.. ఉదయం వధువు ఇంటి నుంచి బయలుదేరగా... ఇంతలోనే ప్రమాదం జరిగింది. దాంతో కుటుమంతా విషాదంలో మునిగిపోయారు. ఇక ఘటనాస్థలిలో వధువు విలపిస్తున్న తీరు అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది. ఇక ప్రమాదం జరగడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: