మైనర్ బాలుడిని  ట్రాప్ చేసినటువంటి ఓ యువతి.. అతన్ని బలవంతంగా వివాహం కూడా చేసుకుంది.. ఆ బాలుడిని నమ్మించి  బలవంతంగా తన మెడలో తాళి కట్టించుకుని తనతో సన్నిహితంగా కూడా గడుపుతోంది. దీంతో సదరు బాలుడు ఫిర్యాదుతో  ఆ యువతిని పోక్సో చట్టం కింద  పోలీసులు అరెస్టు చేశారు. ఈ యొక్క యదార్థ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోయంబత్తూర్ కు చెందినటువంటి పొల్లచ్చికి చెందిన యువతి 19 సంవత్సరాలు, ఆమె స్థానిక పెట్రోల్ బంకులో పని చేస్తూ ఉంది. అయితే అదే ప్రాంతానికి చెందినటువంటి మైనర్ బాలుడు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ వ్యక్తి ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కోసమని  తరచుగా పెట్రోల్ బంకు వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి  ప్రేమ చిగురించింది. ఇలా వారు ఏడాదిపాటు చెట్టాపట్టాలేసుకొని  జాలిగా తిరిగారు. ఈ విషయం ఆ బాలుడి ఇంట్లో తెలిసిపోయింది.

ఆ బాలుడి కుటుంబ సభ్యులు వచ్చి  ఆ యువతిని పలుమార్లు మందలించారు. అయినా ఆమె తీరు మారలేదు. ఇదిలా ఉండగా  అనారోగ్యానికి గురైన టువంటి  ఆ విద్యార్థి బాలుడు దవాఖానలో ఉండగా, ఆ యొక్క యువతి  దగ్గరుండి  అతని బాగోగులు చూసుకున్నట్టు తెలిసింది. అయితే ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆ బాలుడి డిశ్చార్జ్ అవ్వగానే ఆమె పళని స్వామి ఆలయానికి తీసుకెళ్ళింది. మనల్ని ఎవరు విడదీయకుండా ఉండాలంటే  పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది. సదరు బాలుడితో  బలవంతంగా తాళి కూడా కట్టించుకొని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కోయంబత్తూర్ కు వెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఈ సమయంలోనే  తమ కుమారుడు అదృశ్యమయ్యాడు అని  బాలుడు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన టువంటి పోలీసులు  ఇద్దరిని పట్టుకొని పొలాచ్చికి తీసుకొని వచ్చారు. దీంతో తమదైన శైలిలో  వారిని గట్టిగా మందలించగా సదరు  బాలుడు  ఈ యువతి  తనను బలవంతంగా తీసుకెళ్లి  మెడలో తాళి కట్టించుకుంది అని అతను తెలిపాడు. ఆమెతో లైంగికంగా కూడా గడపాలని ఆ యువతి అతనిపై ఒత్తిడి తీసుకు వచ్చినట్టు పోలీసులకు తెలిపాడు. దీంతో  అమ్మాయిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి , ఆ యువతిని కోర్టులో హాజరు పరచి  జైలు శిక్ష విధించారు. అయితే విద్యార్థిని నమ్మించి  పెళ్లి చేసుకున్నటువంటి ఘటనలో యువతి అరెస్ట్ అవ్వడం అనేది  ఇదే మొదటిసారి అని  ఎస్పీ సెలవా నాగరత్నం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: