మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. నేటి రోజుల్లో అయితే అటు మనుషుల ప్రాణాలు తీయడానికి ఎన్నో రకాల మహమ్మారులు దూసుకువస్తున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకున్న జీవితాలను అర్ధాంతరంగా ముగించింది కరోనా. దీంతో ఎన్నో కుటుంబాల్లో కూడా విషాదం నిండిపోయింది  ఇలా ప్రస్తుతం ఎక్కడ కరోనా వైరస్ ప్రాణాలను తీసుకుపోతుందో అని భయ పడుతున్న తరుణంలో.. మరోవైపు  సీజనల్ వ్యాధులు కూడా ఎంతోమంది ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నాయి.



 ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు..  అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక దోమ ఎంతోమంది ప్రాణాలను మింగేస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ ఒక దోమ ఏకంగా తండ్రీకొడుకుల ప్రాణాలను మింగేసింది. డెంగ్యూ అనే మహమ్మారి తో కబలించింది. ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న తండ్రి కొడుకులు ఒకే రోజు కేవలం గంటల వ్యవధిలోనే మృత్యువాత పడడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే గంటల వ్యవధిలోనే తండ్రి కొడుకులు మృతి చెందడంతో అటు ఆ గ్రామంలో పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి.



 పాల్వంచ మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడ కు చెందిన నాగేశ్వరరావు ఆయన కుమారుడు వాసు వారం రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఇక మెరుగైన చికిత్స కోసం భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ విషమిస్తూ  వచ్చింది. ఇక మూడు రోజుల క్రితం ఇద్దరి పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు వారిని ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు  ఇక ఇటీవలే అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆరు గంటల సమయంలో తండ్రి నాగేశ్వరరావు ప్రాణాలు వదిలాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొడుకు వాసు మృతిచెందాడు. ఇలా నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగగానే అటు కొడుకు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరరావు కు భార్య మానసిక వికలాంగుడైన మరో కుమారుడు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: