అమ్మ బాబోయ్..?!!
అంగన్ వాడీ కార్యకర్త.. వీళ్ల గురించి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎవర్ని అడిగినా చెప్పకనే చెబుతారు. ఎక్కువ మంది జనాభా కలిగిన భాారత్ పసిపిల్లలు, గర్భవతులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ అంగన్ వాడీల వ్యవస్థ.  నవ జాత శిశువుల బాబోగులు చూడటం, పిల్లల పెరుగుదల , అభివృద్ధి, తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించడం, ముఖ్యంగా కుటుంబ నియంత్రణ... ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో... అంగన్ వాడీ కార్యకర్తలు చేసేది ఉద్యోగం అనడంకంటే సేవ అనడం సబబుగా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక సందర్భంలో పేర్కోన్నారు.
ఒరిస్సా రాష్ట్రంలో ని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం  ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. కారణం కబిత మాథన్ అనే ఓ అంగన్ వాడీ కార్యకర్త. ఆమె ఆస్తి 4 కోట్ల రూపాయల పై మాటే. సమాచారం అందుకున్న అధికారులు ఆమె  గురించి వాకబు చేశారు,  గత రెండు రోజులుగా శోధనలు నిర్వహించి, బుధవారం భువనేశ్వర్ లో అరెస్టు చేశారు. భువనేశ్వర్ లోని కోరదాక అనే ప్రాంతంలో అంగన్ వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోని చేపల మార్కెట్ వద్ద  కేవలం రేకుల ఇంటిలో నివాసం ఉంటారు.  ఆ ఇంటిలో ఆమెతో పాటు తండ్రి, భర్త  నివాసం ఉంటారు. పోలీసులు మీడియాకుఅందజేసిన వివరాల ప్రకారం ఆమెకు పలుచోట్ల ఆస్తులున్నాయి. నాలుగు అంతస్తుల భవనం ఒకటి, మూడు అంతస్తుల భవ నాలు రెండు, రెండు అంతస్తుల భవనాలు మూడు ఉన్నాయి. వీటికితోడు  వివిధ ప్రాంతాలలో 14 ప్లాట్టలు ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనం ఒకటుంది. ద్వి చక్రవాహనాలు మూడున్నాయి. ఇన్సూరెన్స్ ఖాతాలో 2.2 లక్షల రూపాయలున్నాయి ఇంతే కాకుండా ఆమె వద్ద ఉన్న బంగారం విలువ 6.3 లక్షల పైమాటే.. ఆమె నెల జీతం కేవలం 7,500 మాత్రమే. పొట్ట కూటి కోసం తాను వివిధ రకాల పనులు చేస్తానని, పరోటాలు చేయడం, పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి పనులు చాలా చేస్తానని కబిత మాథన్ పోలీసులకు తన వివరణ ఇచ్చారు.
ఒరిస్సా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది జూలైలో ఓ మూడే తరగతి ఉద్యోగి ఇంటి పై దాడులు నిర్వహించారు అతని వద్ద నుంచి.3.7  కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్. సి. ఆర్. బి గణాకాంల ప్రాకారం...  ప్రభుత్వ ఉద్యోగుల్లో
అక్రమార్జన పరులుగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర  నిలిచింది. తరువాతి స్థానంలో ఒరిస్సా ఉండడం గమనార్హం
 

మరింత సమాచారం తెలుసుకోండి: