కర్ణాటక రాష్ట్రంలో చాలా దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికను కారులో ఎక్కించుకొని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలిక తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చిన మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు హత్యలు ఆగడం లేదు అని చెప్పవచ్చు. దిశ మరియు నిర్భయలాంటి ఎన్నో చట్టాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. అయినా ఆ కామాంధులు కనీసం కూడా భయపడడం లేదు. ఆరు నెలల పాప నుంచి మొదలు కుంటే వందేళ్ల పండు ముసలి వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అఘాయిత్యాలు ఇంకా ఎక్కువైపోయాయి. దీనికి కారణం ఎక్కువగా సెల్ ఫోన్ ప్రభావం అని చెప్పవచ్చు.

 దీనిద్వారా మైనర్ బాలికలు ఎక్కువగా అట్రాక్టివ్ అయిపోయి ముక్కు మొహం తెలియని వారితో సంబంధాలు కలుపుకొని  వారి ఊబిలో చిక్కుకొని చివరకు విగత జీవుల్ల మారిపోతున్నారు. అలాంటి ఓ ఘటన ఈ కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ మైనర్ బాలికను కారులో ఎక్కించుకున్నా కొంత మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ కన్నడ జిల్లా కేంద్రంలోని బట్ వాడు మండలంలోని ఆమతడి గ్రామానికి చెందిన బాలిక పాఠశాలకు వెళ్తుంది. వారికి తెలిసిన వ్యక్తి స్కూల్ వద్ద దింపుతానని చెప్పి కారులో ఎక్కించుకొని  తన పాఠశాల వద్ద ఆమెను దించకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.

అప్పటికే ఆ కారులో ఐదుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. దీంతో భయంతో బాలిక అరవడంతో నోటిని గట్టిగా మూసి ఆ బాలికపై ఐదుగురు  అత్యాచారానికి ఎగబడ్డారు. తర్వాత బాలికను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్లి అక్కడ వదిలిపెట్టారు. చివరికి ఆ బాలిక నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంది. విషయం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఆ నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసి ఇంకా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: