IHGనేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుండి లోయలోకి బస్సు బోల్తాపడి ఆ తరువాత నదిలో బస్సు పడిపోయింది ఈ దుర్ఘటన లో 32 మంది అక్కడి కక్కడే మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమం గా ఉంది. మంగళవారం నాడు ఛాయానాథ్ రారా పరిసర ప్రాంతం లో ఈ ఘటన జరిగింది. పండగను జరుపుకోవడానికి ఇతర ప్రదేశాలకు వెళ్లిన వలస కార్మికులు , విద్యార్థులు నేపాల్ గంజ్‌ అనే ప్రాంతం నుండి ముగు జిల్లా గామ్‌గధి అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే చయనాథ్ ప్రాంతాన్ని దాటిన తరువాత బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతులో పడి పోయింది అనంతరం పినా ఝ్యారీ నదిలో పడి పోయింది. అంతా ఎత్తునుండి బస్సు పడటం తో బస్సు తునాతునకలు అయ్యింది. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అక్కడికక్కడి మరణించారు. 

IHG
ఈ సమాచారం అందుకున్న పోలీస్ , ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నాలు చేసారు . హెలికాఫ్టర్ లలో అక్కడకు చేరుకొని బాధితులను , మృతులను వెలికితీశారు ..వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించగా అప్పటికే 32 మంది చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. చాల ఎత్తునుండి బుస్స్ పడటం తో అక్కడ ఇంకా క్షతగాత్రులు ఉన్నారేమో అని గాలిస్తున్నారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.


IHG

 నేపాల్ లో రోడ్లు రాళ్లతో మమేకమై ఉంటాయి అందులోను కొండా మరియు లోయలలో రోడ్లు ఉండటం వల్ల ప్రమాదాలు ఎటునుండి ముంచుకొస్తాయో చెప్పలేని పరిస్థితి. నేపాల్ లో కేవలం ఒక్క 2019 వ సంవత్సరం లో 13 వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రజలు మాత్రం నేపాల్ ప్రభుత్వం పనితీరును ఎండ గడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఱంత ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే నివ్వెర పోయి చూస్తున్న ప్రభుత్వ పని తీరును ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రోడ్ల పని తీరును మెరుగు పరుస్తుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
 

మరింత సమాచారం తెలుసుకోండి: