IHGటిక్ టాక్ లైవ్ చేస్తున్న మాజీ భార్యపై కిరోసిన్ పోసి అతి కిరాతకంగా  నిప్పంటించి చంపిన భర్త కు చైనా హై కోర్ట్ మరణ శిక్షను ఖరారు చేసింది.  వివరాలలోకి వెళితే చైనా లోని సిచువాన్ ప్రాంతం లో ఉంటున్న టిబెటన్ వ్లాగర్ యినటువంటి అమచు(30 ) అనే మహిళ చైనా టిక్ టాక్ వర్షన్ 'డౌయిన్ ' లో లాము అనే పేరుతో వీడియోలు మరియు లైవ్ లు ఇస్తూ ఉంటుంది. ఆమెకు కేవలం అమెరికా పరిసర ప్రాంతాలనుండి దాదాపు గా 7.70 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు .   అమచు 2009 లో టాంగ్ అనే యువ కుడిని పెళ్లిచేసుకుంది. పెళ్లితరువాత అమచు ఇద్దరిపిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన కొద్దిరోజులకే వారిమధ్య గొడవలు మొదలు అయ్యాయి , ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు .


IHG

 ఈ నేపథ్యం లోనే ఇద్దరూ కలసి జీవించలేమని నిర్ణయం తీసుకుని 2020 , జూన్ లో వీరిద్దరూ వ్రాత పూర్వకంగా విడిపోయారు. ఆ తరువాత కొద్దీ రోజులకే అమచు ను పెళ్లిచేసుకోవలసిందిగా వత్తిడి తెచ్చాడు కానీ అమచు కలసి ఉండడం సాధ్యం కాదని తెగేసి చెప్పింది. అమచు చైనా వెర్షన్ టిక్ టాక్ లో బిజీ అయిపోయింది. ఆమె మేకప్ లేకుండా లైవ్ లు  ఇచ్చేది. పాడిపంటలు. వారి ఇంట్లో పెద్దలతో ఆమె కలసి భోజనం చేసే వీడియోలు ఇతరితర వీడియోలను వీవర్స్ తో పంచుకునేది. ఒకరోజు  అమచు టిక్ టాక్ లైవ్ లో ఉండగా ఆమె మాజీ భర్త టాంగ్  హఠాత్తుగా వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పారిపోయాడు.

IHG
 లైవ్ లో గమనించిన కొందరు వెంటనే పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని విచారణ చేసారు. ఈ ఘటన 2020 జూన్లో జారుగగా తాజాగా శుక్రవారం ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది. ఈ తీర్పులో అతడికి మరణ శిక్షను కోర్టు ఖరారు చేసింది. టాంగ్ ఉద్దేశపూర్వకంగానే అమాచు ను హత్యచేసినట్లు కోర్టు నిర్దారణకొచ్చింది.  టాంగ్ ఈ క్రూరమైన చర్యకు మరణ శిక్షే ఉత్తమం అని పేర్కొంది


మరింత సమాచారం తెలుసుకోండి: