ఆన్లైన్ లో ఓ యువతీ బ్లాక్ మెయిల్  కారణంగా తన సర్వం కోల్పోయిన ఓ ఉద్యోగి మరికొంత డబ్బు వారికీ చెల్లించడానికి లోన్ కోసం ప్రయత్నించగా సదరు ఫేక్ బ్యాంకు సిబ్బంది కూడా అతడిని మోసం చేయడంతో 16.72  లక్షలు నష్టపోయాడు. రాచకొండ కమీషనరేట్ సమీపం లో ఈ ఘటన జరుగగా ఘట్కేసర్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘట్కేసర్ లో నివాసముంటున్న బాధితుడు(32) గత సంవత్సరం అక్టోబర్ నెలలో తన పేస్ బుక్ ఖాతాకు ఓ యువతీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసాడు. అప్పటినుండి ఆ యువతీ ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ చాటింగ్ లు . ఫోన్ లో సంభాషణలతో  కొంత కాలం గడిపాడు. ఆ పరిచయం కాస్త ఒకరి నొకరు బట్టలు లేకుండా చాట్ చేసుకొనే దాకా వెళ్ళింది. 


అతడు  వీడియో కాల్ ముగించిన తరువాత అతడికి ఓ వాట్సాప్ వీడియో వచ్చింది . అతడు ఆ వీడియో ని తెరిచి చూడగా అతడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆ యువతీ తో అతడి మాట్లాడిన న్యూడ్ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆ వీడియో ని సోషల్ మీడియా లో పెట్టకుండా ఉండాలంటే తనకు కొంతే డబ్బు కావాల్సింది గా ఆ యువతీ బెదిరించింది. పరువు కోసం భయపడిన అతడు వెంటనే ఆమె ఖాతాకు 1.4  లక్షలు  పంపించాడు. వెంటనే తన పేస్ బుక్ ఐడి డిలీట్ చేసి వెంటనే అతని ఫోన్ నుంబర్ ను స్విచ్ ఆఫ్ చేసాడు. కొంత కాలం తరువాత అతడు తన పాత ఫోన్ నుంబర్ ను ఆన్ చేయగా మల్లి అతడికి  ఫోన్  కి మళ్లీ  వీడియో లు వచ్చాయి. అతడి కి మళ్లీ  బెదిరింపులు మొదలవ్వడం తో మరో 8 లక్షలు చెల్లించాడు. అబెదిరింపులు తాళలేక " పైసాబజార్.కామ్  "లో లోన్ 11 లక్షల అప్పుకోసం ప్రయత్నం చేసాడు.



 ఈ లోగా ముత్తూట్ పిన్ కార్ప్ నుండి అంటూ ప్రీతీ అనే యువతీ కాల్ చేసింది. పలు మార్లు ఐటీ రిటున్స్ ఛార్జ్ లు , ప్రాసెసింగ్ ఛార్జ్ , భీమా మొదలగు కారణాలతో అతడి దగ్గర దాదాపుగా 7.32  లక్షలు చెల్లించాడు ఆ తరువాత నాలుగైదు రోజుల్లో అతడి ఖాతా లో డబ్బు జమ అవుతుందని చెప్పారు. ఇంతలో ఊహించని విధంగా ఆర్బిఎల్ అనే బ్యాంకు నుండి అతడి కి లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది మీరు లోన్ పొందవచ్చు అని మెసేజ్ వచ్చింది. ఆ బ్యాంకు లో తనకు ఖాతా లేనప్పుడు లోన్ ప్రాసెస్ ఎలాజరుగుతుందని డౌట్ రావడంతో. వెంటనే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసాడు. అయితే అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నోయిడాలోని ఆర్బిఎల్ బ్యాంకు లో అతడి పేరుమీద లోన్ కోసం నకిలీ వ్యక్తులు ప్రయత్నించగా ఈ విషయం పోలీసులు బయటపెట్టారు.  ఇలా అతడు పలుమార్లు మోసపోయి దాదాపుగా 16.72 లక్షల నష్ట పోయాడు


మరింత సమాచారం తెలుసుకోండి: