కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయి.. వ్యవసాయంపై ఆధారపడ్డారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. ఇంట్లో కుటుంబసభ్యులకు కరోనా వస్తే ఆస్పత్రుల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. కాలాన్ని వెల్లదీస్తూ వచ్చారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ.. ఇతర కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరోనా రావడంతో కొందరి ఇళ్లలో పెద్దదిక్కే మరణించడంతో కుటుంబమే చిన్నాభిన్నమైంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని హుక్కేరి సమీప గ్రామం బొర్గాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో సహా నలుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. గతేడాది బ్లాక్ ఫంగస్‌తో మృతుడి భార్య జయక్క చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.  

పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఐదుగురు విగత జీవుల్లా కనిపించారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో తన భార్య బ్లాక్ ఫంగస్ వచ్చి చనిపోవడం వల్ల భర్త హదిమిణి ఎంతో కుమిలిపోతున్నామని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గోపాల్ దొడ్డప్ప హదిమణి (47) రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. వీరి సంతానం సౌమ్య, స్వాతి, సాక్షి, సృజన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే తండ్రి హదిమణి పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి తానూ విషం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే అంత్యక్రియల కోసం రూ.20 వేలు పక్కన పెట్టాడని, దహన సంస్కారాలు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు నిర్వహించాలని హదిమణి పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: