బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టులు బయటపడు తున్నాయి. ఆర్యన్ ను అరెస్ట్ చేసిన రోజే ఎన్ సిబి అధికారులు షారుక్ ఖాన్ తో 25 కోట్ల డీల్ మాట్లాడుకున్నారన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆర్యన్ ను రిలీజ్ చేయడానికి ఎన్ సిబి ఆఫీసర్ తో పాటు మరికొందరు షారుక్ ను 25 కోట్లు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేశారు. ఈ ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి కేసును విచారిస్తున్న ఎన్ సిబి అధికారులో ఒకరైన గోసావి పర్సనల్ బాడీగార్డ్.కొద్ది రోజులుగా గోసావి కనిపించడం లేదు.

దీంతో ప్రాణభయంతో జరిగిన విషయం బయట పెట్టనున్నారు ప్రభాకర్ సాయిల్. ఈ నెల 2న రాత్రి  ముంబైలోని ఓ క్రూష్ షిప్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై రైడ్స్ చేసింది ఎన్ సి బి. ఇందులో అరెస్టయిన ఆర్యన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. రైడ్స్ టైం లో తాను కేపీ గోసావి తో కలిసి స్పాట్ కు వెళ్లానని ఎన్ సిబి తరపున ఉన్న తొమ్మిది మంది సాక్షుల్లో ఒకరైన ప్రభాకర్ తెలిపారు. ఆర్యన్ ను అరెస్టు చేసే ఎన్ సిబి ఆఫీస్ కు  తీసుకొచ్చాక శాన్ డిసోజ అనే వ్యక్తితో గోసావి ఫోన్లో మాట్లాడనన్నారు. ఆర్యన్ ను రిలీజ్ చేయడానికి 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు ప్రభాకర్. చివరకు 18 కోట్లకు డీల్ కుదిరిందన్నారు. ఈ అమౌంట్ లో 8 కోట్లు డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఎన్ సిబి జోనల్ డైరెక్టర్ వంఖడే కు ఇవ్వాల్సి ఉందని కూడా డిసోజ కు గోసావి చెప్పారన్నారు. తర్వాత గోసావి, డిసోజ లను షారుక్ మేనేజర్ పూజా కలిశారని చెప్పారు. కారులో 15 నిమిషాలపాటు మీటింగ్ జరిగిందన్నారు. అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోసావి కి 50 లక్షలు ఇచ్చారని ఇందులో 38 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఈ వివరాలన్నీ తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉన్నాయన్నారు. 2018లో ఓ చీటింగ్ కేసు కు సంబంధించి  గోసావి కోసం పూణే పోలీసులు ఈమద్యే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతని బాడీ గార్డ్ అని చెబుతున్న ప్రభాకర్ సాయిల్ కూడా తమ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఆరోపణలు చేశారంటున్నారుఎన్ సిబి అధికారులు. మరోవైపు తనను అరెస్టు చేయద్దంటూ ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ కు లెటర్ రాశారు ఎన్ సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.

 తనను కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో కీలకంగా ఉన్న ఎన్ సిబి ఆఫీసర్ వాంఖడే పై మహారాష్ట్ర సర్కార్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉంది. ఏడాదిలోగా  వంఖడే జాబ్ పోవడం ఖాయమన్నారు మంత్రి నవాబ్ మాలిక్. తప్పుడు కేసులతో ప్రజలను వేధిస్తున్న వంఖడే కు పూర్తి సమాచారం ఉందన్నారు. వంఖడే కు ప్రాణ హాని కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: