సాధారణంగా బ్యాంకుల్లో ఓ అకౌంట్ ఓపెన్ చేయాలంటే... ఎన్నో సంతకాలు చేయాలి. అలాగే ఎన్నో డాక్యుమెంట్లు కూడా అందించాల్సిందే. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన నిబంధనలు తప్పని సరిగా పాటించాల్సిందే. ఈ నిబంధనలు అన్నీ తప్పని సరిగా అనుసరించాల్సిందే. వీటన్నిటికీ తోడు కేవైసీ ఫామ్ ఫిల్ చేయడం కూడా తప్పని సరి. బ్యాంకులో ఖాతా తెరవాలంటే... ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ తప్పని సరి. వీటికి తోడు పాన్ కార్డు నంబర్ కూడా బ్యాంకు అధికారులకు అందించాలి. ఇవన్నీ ఉంటేనే అకౌంట్ ప్రారంభిస్తారు. చెక్ బుక్, పాస్ బుక్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుమతి ఇస్తారు. కానీ.... ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఓ కో ఆపరేటివ్ బ్యాంక్ మాత్రం భారీ సంఖ్యలో అకౌంట్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... పదుల సంఖ్యలో కూడా కాదు... ఏకంగా 12 వందల అకౌంట్లకు కేవైసీ వివరాలు లేవు. పాన్ కార్డు ప్రస్తావనే లేదు. ఇవేవీ లేకుండానే అకౌంట్లను ప్రారంభించారు.

ఫేక్ అకౌంట్లను ప్రారంభించడమే కాకుండా... అందులో ఏకంగా 54 కోట్ల రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. ఫేక్ అకౌంట్లను చలామణి కూడా చేస్తున్నారు. అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి. బ్యాంకులో పెద్ద ఎత్తున నకిలీ అకౌంట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ అధికారులు.... బ్యాంక్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంక్ కేవైసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి కనీస ప్రాధమిక వివరాలు కూడా లేకుండా 12 వందల అకౌంట్లు బ్యాంకులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్లలో ఉన్న 54 కోట్ల నగదును సీజ్ చేశారు ఆర్‌బీఐ అధికారులు. పక్కా సమాచారంతో అక్టోబర్ 27న తేదీన ఈ రైడ్ నిర్వహించారు. దాదాపు ఆరు రోజుల పాటు నిరంతరాయంగా సోదాలు నిర్వహించారు. అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తూ అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు కేసులు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: