అదేంటోగాని నేటి రోజుల్లో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రాణాలు తీసుకోవడం అంటే చాక్లెట్ తినడం అంత ఈజీ అయిపోయింది అందరికీ. విలువైన ప్రాణాలను తీసుకుంటూ ఎంతోమంది అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనిషి ప్రాణాలకు విలువ ఉందా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు నేటి రోజుల్లో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే అసలు మనిషి ఆలోచన తీరు కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.


 ఇలా రోజుకు ఆత్మహత్యలు హత్యలు అంటూ ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటారా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ ఘటనతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. చిన్న కారణానికి యువతి బలవన్మరణానికి పాల్పడింది. పుట్టిన రోజున ప్రేమికుడితో మాట్లాడలేకపోయాను అన్న కారణంతో ఓ 18 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.


 ఈ ఘటన కోయంబత్తూర్ లో వెలుగులోకి వచ్చింది. ఇరుకురాయి  ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి కుమార్తే పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఈ క్రమంలోనే నానమ్మ వాళ్ల ఇంట్లో ఉంటుంది ఆ యువతి.. ఇక అదే ప్రాంతంలో ఉన్న ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. విషయం తెలిసి తండ్రి నానమ్మ ఇంటి దగ్గర నుంచి కోయంబత్తూర్ కి తీసుకొచ్చాడు. కూతురు దగ్గర సెల్ ఫోన్ కూడా పెట్టలేదు. అయితే ఇటీవలే ఆ యువతీ పుట్టిన రోజు జరిగింది. పుట్టినరోజున ప్రియుడితో మాట్లాడలేకపోయాను అంటూ ఎంతో బాధపడింది ఆ యువతి. దీంతో పుట్టినరోజు నాడే గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: