నలుగురు నిందితులకు కేరళ హై కోర్టు  మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌కు వ్యతిరేకంగా సీబీఐ చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సిబిఐ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు  స్వీకరించింది. ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. నవంబర్ 29న తదుపరి  విచారణ జరపనుంది.
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసుకు సంబంధించి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సహా నలుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు రాగా, ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసి నవంబర్ 29న విచారణకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులున్నారు. వారు గుజరాత్ మాజీ డిజిపి, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు , విశ్రాంత ఇంటెలిజెన్స్ అధికారికి హైకోర్టు ఆగస్టు 13న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు ముందస్తు బెయిల్ పొందిన వారిలో ఆర్‌బి శ్రీకుమార్ (గుజరాత్ మాజీ డిజిపి), విజయన్, తంపి ఎస్ దుర్గా దత్ మరియు పిఎస్ జయప్రకాష్ లు ఉన్నారు. వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వల్ల ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆయన ఈ కేసు వివరాలను కోర్టు ముందుంచారు.
 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి పథం ముందుకు సాగక పోవడం వల్ల  కొంతమంది శాస్త్రవేత్తలు ఇబ్బందులు పడినట్లు సీబీఐ తన విచారణలో గుర్తించిందని తెలిపారు. గూఢ చర్యం ఫలితంగా  భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలు వెనుక బడినట్లు తెలిపారు.  దేశ అంతరిక్ష అభివృద్ది  రెండు దశాబ్దాలు వెనకబడిందని ఆయన కోర్టుకు వివరించారు.   వాదనలు విన్న న్యాయ మూర్తులు తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: